ఇందిరా గాంధీని గుర్తు చేస్తున్న ప్రియాంకా గాంధీ, మేడమ్ మాటలతో !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా జాతీయ పార్టీ నాయకులు కర్ణాటకలో మకాం వేస్తున్నారు. ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఓటర్ల నాడి ఏమిటి అని రెండు పార్టీల నాయకులతో పాటు జేడీఎస్ పార్టీ కూడా గుర్తించలేపోయింది.
కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మరోసారి అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిపోతామని చాలా మంది నాయకులు అనుకుంటున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో మాత్రం కొందరు నాయకులు ఊహించలేకపోతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో ప్రియాంకా గాంధీ కర్ణాటకలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ఊహించని మద్దతు వస్తోంది. మంగళవారం మైసూరు. చామరాజనగర జిల్లాల్లో ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రాచారం చేశారు. ఈ సందర్బంగా మహిళలతో ప్రియాంకా గాంధీ ప్రత్యేక సమావేశాలు, చర్చలు జరిపారు.
మీ నానమ్మ ఇందిరా గాంధీని చూసినట్లు ఉందని చాలా మంది మహిళలు చెప్పడంతో ప్రియాంకా గాంధీ చాలా సంతోషంతో పులకించిపోయారు. ఇందిరా గాంధీ పేద ప్రజలను ఎలా ఆదుకున్నారో అలాగే మీరు కూడా మా ప్రాంత ప్రజలను ఆదుకోవాలని హానూరు నియోజక వర్గం ప్రజలు ప్రియాంకా గాంధీకి మనవి చేశారు.

కర్ణాటకలో త్వరలో మన ప్రభుత్వం (కాంగ్రెస్) వస్తుందని, తరువాత మీ సమస్యలు మొత్తం పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, నెల రోజులు మీరు ఓపిక పట్టాలని ప్రియాంకా గాంధీ స్థానిక ప్రజలు హామీ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్లస్ పాయింట్ అవుతున్నది.












Click it and Unblock the Notifications