Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lady techie: కారు బానెట్ మీద రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లేడీ టెక్కి, పక్కలో భర్త, ఏం జరిగిందంటే !

బెంగళూరు: బెంగళూరు నగరంలో మరోసారి అరాచకం జరిగింది. బెంగళూరులోని వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్‌లోని మగాడి టోల్ సమీపంలో ఇటీవల అర్ద కిలోమీటరు దూరంలో వృద్ధుడిని ఓ యువకుడు స్కూట్ లో ఈడ్చుకెళ్లిన ఘటన ప్రజలు మరువకముందే మరోసారి సేమ్ సీన్ అదే బెంగళూరులో రిపీట్ అయ్యింది. చిన్న విషయంలో ఇరు వర్గాల మద్య వాగ్వాదం జరిగిన తరువాత ఒక లేడీ టెక్కీ సినిమా స్టైల్లో కారు బానెట్‌పై కూర్చున్న వ్యక్తిని సుమారు 2 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. సారీ చెప్పమని అడిగిన వ్యక్తి ప్రాణాలతో ఓ లేడీ టెక్కీ చెలగాటం ఆడటం కలకలం రేపింది. దెబ్బకు లేడీ టెక్కీ, ఆమె భర్తతో పాటు మరో వర్గానికి చెందిన ఐదు మంది మీద కేసులు నమోదు అయ్యాయి. క్షమాపణ చెప్పమని బలవంతం చేసిన వ్యక్తి చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో సామాన్య ప్రజలు హీరోలు అయ్యి అతన్ని రక్షించారు.

టెక్కీ దంపతులు

టెక్కీ దంపతులు

బెంగళూరులో లేడీ టెక్కి ప్రియాంక నివాసం ఉంటున్నది. ప్రియాంక భర్త ప్రమోద్ కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరు. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ప్రియాంక, ఆమె భర్త ప్రమోద్ టెక్కీలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. శుక్రవారం టాటా ఎక్సాన్ కారులో సాఫ్ట్ వేర్ దంపతులు ప్రియాంక, ప్రమోద్ అంబేద్కర్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రి నుంచి ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు.

రోడ్డు జామ్ అయ్యింది

రోడ్డు జామ్ అయ్యింది

లేడీ టెక్కీ ప్రియాంక కారు నడుపుతోంది. ఆసుపత్రి నుంచి బయలుదేరిన ప్రియాంక. ప్రమోద్ దంపతులు నాగరబావి వైపు నుంచి రింగ్ రోడ్డు మీదుగా ఉల్లా మెయిన్ రోడ్డు దగ్గర కుడివైపు టర్న్ తీసుకున్నారు. అదే సమయంలో హోటల్ వ్యాపారి దర్శన్ అనే యువకుడు అతని స్నేహితులతో కలిసి స్విఫ్ట్ కారులో రెస్టారెంట్ కు బయలుదేరాడు. మార్గం హద్యలో ఉల్లాళ మెయిన్ రోడ్డు సిగ్నల్ వద్ద జ్ఞానభారతి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఎదురుగా ప్రియాంక కారు రావడం, ఎదురు దర్శన్ వెలుతున్న కారు వెళ్లడంతో ఆ మార్గంలో రోడ్డు జామ్ అయింది.

మధ్య వేలు చూపించి బూతులు తిట్టిన ప్రియాంక ?

మధ్య వేలు చూపించి బూతులు తిట్టిన ప్రియాంక ?

సిగ్నల్ పడి ఉన్నా ఎందుకు నువ్వు కారులో అడ్డంగా వచ్చావు అంటూ దర్శన్ లేడీ టెక్కీ ప్రియాంకను ప్రశ్నించాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన లేడీ టెక్కీ ప్రియాంక ఆమె చేతి మధ్య వేలును పైకి చూపిస్తూ దర్శన్‌ను అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపణలు ఉన్నాయి. ఓ అమ్మాయి అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో దర్శన్ రగిలిపోయాడు. వెంటనే అతని కారులో నుంచి కిందకు దిగిన దర్శన్ ప్రియాంక కారు దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో ప్రియాంక కారు నడుపుకుని వెళ్లిపోయింది. దర్శన్ అతని కారులో ప్రియాంక వెలుతున్న టాటా ఎక్సాన్ కారును వెంబడించాడు.

సారీ చెబుతావా ? లేదా

సారీ చెబుతావా ? లేదా

ప్రియాంక కారు వేగంగా నడిపింది. దర్శన్ ప్రియాంక కారును వెంబడించి మంగళూరు పీయూసీ కాలేజ్ సమీపంలో ప్రియాంక కారును అడ్డగించాడు. నన్ను బూతులు తిడుతావా మర్యాదగా క్షమాపణ చెప్పు అని దర్శన్ డిమాండ్ చేశాడు. ఈ సమయంలో లేడీ టెక్కీ ప్రియాంక, ప్రమోద్ దంపతులు, దర్శన్ అతని స్నేహితుల మధ్య మాటామాటా పెరిగింది. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అన ఇరువర్గాలు రెచ్చిపోయారని తెలిసింది. దర్శన్ ప్రియాంక కారు బానెట్ మీద ఎక్కి కుర్చుని సారీ చెప్పు అని డిమాండ్ చేశాడు. రోడ్డు మీద గొడవ జరుగుతుందని తెలుసుకున్న హొయ్సల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కారు బానెట్ మీద రెండు కిలోమీటర్లు.... దేవుడా !

కారు బానెట్ మీద రెండు కిలోమీటర్లు.... దేవుడా !

పోలీసులు వచ్చిన విషయాన్ని గమనించిన ప్రియాంక కారు నడిపింది. కారు బానెట్ మీద కుర్చున్న దర్శన్ కిందకు దూకలేక అలాగే కుర్చున్నాడు. అయితే ప్రియాంక మాత్రం ఇంచికూడా వెనక్కి తగ్గకుండా కారు రింగ్ రోడ్డులో వేగంగా నడిపింది. దర్శన్ కారు బానెట్‌పై కూర్చుని ఏంజరుగుతుందో అని ఆందోళన చెందాడు. లేడీ టెక్కి ప్రియాంక మాత్రం కారు ఆపకుండా విద్యానికేతన్ స్కూల్ వైపు నుంచి జ్ఞానభారతి ఆర్టీఓ కార్యాలయం వైపు కారును వేగంగా నడిపింది.

బిత్తరపోయిన ప్రజలు

బిత్తరపోయిన ప్రజలు

సినిమా స్టైల్‌లో దర్శన్ కారు బానెట్‌కు వేలాడుతూ ఉండడాన్ని చూసిన ద్విచక్ర వాహనదారులు లేడీ టెక్కీ ప్రియాంక కారును వెంబడించి కారు ఆపమని కేకలు వేశారు. కారు ఆపమని ప్రజలు కేకలు వేస్తున్నా ప్రియాంక మాత్రం కారు నిలపకుండా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. ప్రియాంక కారును బైక్ లో వెలుతున్న కొందరు సినిమా స్టైల్లో చేజింగ్ చేస్తూ వెళ్లారు. చివరికి రింగ్ రోడ్డులోని సంకల్ప ఆసుపత్రి సమీపంలో ఆటో డ్రైవర్లు కొందరు ప్రియాంక కారును అడ్డగించి బానెట్ మీద కుర్చుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రెండు కిలోమీటర్లు వెళ్లిన దర్శన్‌ను రక్షించారు.

సేమ్ సినిమా స్టైల్లో క్లైమాక్స్ లో వెళ్లిన పోలీసులు

సేమ్ సినిమా స్టైల్లో క్లైమాక్స్ లో వెళ్లిన పోలీసులు

నీకు బుద్ది ఉందా, నువ్వు ఆడదానివేనా, ఓ మనిషిని కారు బానెట్ మీద కుర్చుబెట్టి ఇంత దూరం కారు వేగంగా నడుపుకుంటూ వస్తావా అంటూ ఆటో డ్రైవర్లు, అంతరకు కారును వెంబడించిన బైక్ ల్లో వెళ్లిన వారు ప్రియాంకకు చివాట్లు పెట్టారు. సినిమా స్టైల్లోనే క్లైమాక్స్ లో హొయస్సల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు మండిపోయి ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలుచుకుని వెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న తరువాత ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదు చేసుకోవడందో ఇద్దరి మీద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

అందరూ అందర్

అందరూ అందర్

లేడీ టెక్కీ ప్రియాంక, ఆమె భర్త ప్రమోద్‌ లపై హత్యాయత్నం, బెదిరింపులు, దుర్భాషలాడడం, అసభ్యకరంగా మాట్లాడటం, అసభ్య పదజాలం ఉపయోగించడం, విచ్చలవిడిగా డ్రైవింగ్ చేశారని కేసులు నమోదు చేశారు. టెక్కీల మీద దర్శన్‌ కేసు పెట్టడంతో ఇద్దరి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. లేడీ టెక్కి ప్రియాంక భర్త ప్రమోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులు, అసభ్యకరంగా మాట్లాడి మానసికంగా వేధించారని, చంపేస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపణలపై దర్శన్ మరియు అతని స్నేహితులపై మీద కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు. రెండు కేసులకు సంబంధించి ఐదు మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం మీద కారు బానెట్ మీద కుర్చున్న వ్యక్తిని రెండు కిలోమీటర్లు ఎత్తుకెళ్లిన లేడీ టెక్కీ ప్రియాంక ఆ ప్రాంత ప్రజలకు సినిమా చూపించందని పోలీసులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+