వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమస్తే నేను ప్రియాంకా గాంధీ మాట్లాడుతున్నాను: ఆడియో ద్వారా కార్యకర్తలకు సందేశం

|
Google Oneindia TeluguNews

మరో మూడునెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు పదునైన అస్త్రంగా ప్రియాంకాగాంధీని చూస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఓ గేమ్‌‌ఛేంజర్ అవుతారని ఆపార్టీ భావిస్తోంది. దీంతో ప్రియాంకాగాంధీ తన తొలి మెగా రోడ్‌షోలో పాల్గొనేందుకు సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని లక్నోకు చేరుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశం తర్వాత తన తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.

ఇక ప్రియాంకా రోడ్‌షోలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఇంఛార్జి జోతిరాదిత్య సింధియా కూడా పాల్గొననున్నారు. ఇక తన పర్యటనకు ముందే తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ ఇంఛార్జిగా అధికారిక సందేశం ఓ ఆడియో ద్వారా పంపారు. " నమస్కారం.. నేను ప్రియాంకాగాంధీని మాట్లాడుతున్నాను. రేపు మీ అందరిని కలిసేందుకు లక్నో వస్తున్నాను. కొత్త రాజకీయాలకోసం అందరం కలిసి పనిచేస్తామన్న ప్రగాఢ నమ్మకం నాకుంది. ఈ రాజకీయాల్లో అందరూ భాగస్వాములు కావాలన్నదే నా ఆకాంక్ష. నా స్నేహితులు, నా సోదరీమణులు, ప్రతిఒక్కరి గొంతును వినిపిస్తాను" కాంగ్రెస్ శక్తి యాప్ ద్వారా మాట్లాడిన ఆడియోను విడుదల చేశారు.

Priyanka to step in UP for the first time after she was appointed as general secretary

ఇక ముగ్గురు నేతలు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అక్కడి నుంచే పార్టీ కార్యలయం వరకు రోడ్‌షో నిర్వహించాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందుకోసం 28 చోట్లను గుర్తించారు. అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు నేతలను సన్మానిస్తారు. లాల్‌బాగ్ మూడురోడ్ల జంక్షన్‌లో ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు.

ప్రియాంకాగాంధీ పర్యటనతోనే యూపీలో అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రియాంకాగాంధీ, జోతిరాదిత్య సింధియాలు ఫిబ్రవరి 12,13,14వ తేదీల్లో సమావేశమై మాట్లాడతారు. రాహుల్ గాంధీ మాత్రం అదే రోజు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.

English summary
Weeks after her appointment as Congress General Secretary, Priyanka Gandhi will be visiting her homestate UP on Monday. Before that Priyanka Gandhi released a audio addressing the congress workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X