వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూప్రసాద్ కాళ్లు కడిగి, చెప్పులు మోసిన పోలీసులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాంచీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పోలీసులతో కాళ్లు కడిగించుకొని, స్లిప్పర్లు మోయించినట్లుగా కథనాలు వచ్చాయి. దీనిపై జార్ఖండ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో లాలూ రెండు రోజుల క్రితం బిర్సాముండా జైలు నుండి విడుదలయ్యారు.

అనంతరం ఆయన రామ్‌ఘర్‌లోని రాజ్రప్పా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సమయంలో లాలూ పాదాలను ఓ పోలీసు అధికారి(డిఎస్పీ ర్యాంక్ అధికారి) నీళ్లు పోసి కడిగారట. మరో పోలీసు లాలూ చెప్పులను చేతులతో పట్టుకొని మోశారట. ఈ కథనాలు రావడంతో విమర్శలు వస్తున్నాయి. గుడిలోకి వెళ్లే ముందు సదరు అధికారి లాలూ కాళ్లను నీటితో శుభ్రం చేశారట.

Lalu Prasad Yadav

దీనిపై సదరు అధికారి స్పందిస్తూ... కాళ్లు కడుక్కునేందుకు లాలూ నీళ్లు అడగగా, తాను ఆయన పాదాల పైన పోశానని చెప్పారట. లాలూ, తాను ఒకే గ్రామం నుండి వచ్చామని, చిన్నప్పటి నుండి తనకు తెలుసునని ఆ అధికారి వివరణ ఇస్తున్నారట. అయితే యూనిఫాంలో ఉన్నప్పుడు ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

కాగా, కాళ్లు కడగడం, చెప్పులు మోయించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు బుధవారం దీనిపై విచారణకు ఆదేశించారు. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు.

English summary

 Jharkhand police on Wednesday ordered a probe into media pictures showing a police officer washing the feet of Lalu Prasad Yadav before the RJD Chief went inside a temple while another policeman allegedly carried Mr Lalu's slippers, a senior police officer said in Ranchi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X