విద్యార్థులకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ కేసు సీబీ సీఐడీకి, మొబైల్ సీజ్, ఎవరా పెద్దలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: కాలేజ్ విద్యార్థులకు 20 నిమిషాలు సెక్స్ పాఠాలు చెప్పి అమ్మాయిలను వ్యభిచారం కూపంలోకి లాగడానికి ప్రయత్నించారని ఆరోపిస్తు అరెస్టు చేసిన తమిళనాడులోని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి కేసును సీబీ సీఐడీకి బదిలి చేశారు. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, మహిళ సంఘాలు ఆందోళన ఎక్కువ కావడంతో మంగళవారం నిర్మలా దేవి కేసును సీబీ సీఐడీకి అప్పగించారు. నిర్మలా దేవి వెనుక ఉన్న ఆ రాసలీలల పెద్దలు ఎవరు అని ఆరా తీస్తున్నారు.

మూడు వేల మంది

మూడు వేల మంది

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని అరుప్పుకోటైలోని దేవాంగర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో మూడు వేల మందికిపైగా అమ్మాయిలు, అబ్బాయిలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇదే కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న నిర్మలా దేవి అమ్మాయిలను వ్యభిచారం రోంపిలోకి లాగడానికి ప్రయత్నించి అరెస్టు అయిన విషయం తెలిసిందే.

మేడమ్ మీద ఐపీసీ !

మేడమ్ మీద ఐపీసీ !

నిర్మలా దేవిని అరెస్టు చేసిన విరుప్పుకోటై పోలీసులు ఆమె మీద ఐపీఎస్ సెక్షన్ 511, 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి నుంచి స్థానిక పోలీసులు నిర్మలా దేవిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

కేసు సీబీ సీఐడీకి ఇవ్వండి

కేసు సీబీ సీఐడీకి ఇవ్వండి

విద్యార్థులకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని వ్యభిచారంలోకి దింపాలని నిర్మలా దేవి ప్రయత్నించారని నమోదు అయిన కేసును వెంటనే సీబీ సీఐడీకి అప్పగించాలని తమిళనాడు డీజీపీ టీకే. రాజేంద్రన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

సీబీఐ విచారణకు డిమాండ్

సీబీఐ విచారణకు డిమాండ్

నిర్మలా దేవి వెనుక చాల మంది పెద్దలు ఉన్నారనే అనుమానం ఉందని, వారి పేర్లు మొత్తం బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే, పీఎంకే పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

విద్యా శాఖ మంత్రి

విద్యా శాఖ మంత్రి

నిర్మలా దేవి వ్యవహారంలో ఇప్పటికే విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రిటైడ్ ఐఏఎస్ అధికారితో ప్రత్యేక కమిటీ వేయించి విచారణ చేయిస్తున్నారని, మదురై కామరాజ్ యూనివర్శిటీ ప్రత్యేక కమిటీ వేయించి విచారణ చేయిస్తోందని తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేపీ. అన్బళగన్ మంగళవారం మీడియాకు చెప్పారు.

అవసరం అయితే సీబీఐ

అవసరం అయితే సీబీఐ

కాలేజ్ అమ్మాయిలను వ్యభిచారులుగా తయారు చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి కేసును అవసరం అయితే సీబీఐతో దర్యాప్తు చేయించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి కేపీ. అన్బళగన్ అన్నారు.

మేడమ్ ఫోన్ లో ఏం ఉంది !

మేడమ్ ఫోన్ లో ఏం ఉంది !

అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి విద్యార్థినిలతో ఫోన్ లో మాట్లాడి వారిని పై అధికారుల లైంగిక వాంచతీర్చాలని

ఒత్తిడి చేసిందని కేసు నమోదు అయ్యింది. నిర్మలా దేవి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో మదురై కామరాజు యూనివర్శిటీకి చెందిన అధికారులు ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా, ఆమె ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడారు అనే పూర్తి సమాచారం సేకరించే పనిలో పోలీసు అధికారులు నిమగ్నం అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu DGP T K Rajendran directed the shifting of a case connected to a woman professor luring girl students to yield to 'sexual favours' of higher ranking authorities, from the local police to the CB-CID.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి