కర్ణాటక రిజల్ట్స్: బిఎస్పీపై కన్నడ ఓటర్ల కరుణ, ఇతర పార్టీలపై చిన్న చూపు
బెంగుళూరు: ఇతర రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆశించిన పలితాలను సాధించలేదు. జెడి(ఎస్)తో పొత్తు కారణంగా బిఎస్పీ ఒక్క స్థానం కైవసం చేసుకొంది. అంతేకాదు ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించింది.
కర్ణాటక రాష్ట్రంలో జెడి(ఎస్)తో బిఎస్పీతో పొత్తు పెట్టుకొంది.ఈ పొత్తు కారణంగా బిఎస్పీ ఒక్క సీటును కైవసం చేసుకొంది. కర్ణాటక రాష్ట్రంలో బిఎస్పీ 18 సీట్లలో పోటీ చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్ వాదీ పార్టీ కూడ కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేసింది. కర్ణాటకలో ఎస్పీ సుమారు 27 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. మైసూరు రీజియన్ లో ఎక్కువగా ఆ పార్టీ పోటీ చేసింది. అంతేకాదు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రచారం చేస్తారని తొలుత ప్రచారం సాగింది. కానీ, ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. కానీ, ఆ పార్టీకి ఆశించిన ఓట్లు కూడ రాలేదు.
శివసేన 40 సీట్లలో కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేసింది. ముంబై-కర్ణాటక రీజియన్ లో శివసేన పోటీ చేసింది. అయితే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కేవలం వెయ్యి ఓట్లలోపునే శివసేన సాధించింది.
బీహర్ రాష్ట్రంలో బిజెపితో మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్(యునైటెడ్) కూడ సుమారు 28 సీట్లలో పోటీ చేసింది. ఆలంద్ సీటులో జెడి(యూ) మూడవ స్థానంతో సరిపెట్టుకొంది. ఆ పార్టీకి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే లభించాయి.
కర్ణాటక రాష్ట్రంలో ఆప్ కూడ సరైన ఓట్లను రాబట్టుకోలేకపోయింది. మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే, కెప్టెన్ గోపినాథ్ లాంటి వాళ్ళు ఆప్ లో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఆశించిన ఓట్లు రాలేదు. సుమారు 20 సీట్లలో ఆ పార్టీ పోటీ చేసింది. అయితే ఇందులో 11 స్థానాలు బెంగుళూరుతో పాటు ఉత్తరకర్ణాటక ప్రాంతానికి చెందినవి కావడం గమనార్హం,. బసవకళ్యాణ్ నియోజకవర్గంలో మాత్రమే ఆప్ 1747 ఓట్ల సాధించింది.












Click it and Unblock the Notifications