కన్నడ సాహితీ వేత్త హత్య: సీఐడి దర్యాప్తు (వీడియో)
ధారవాడ: ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మాజీ ఉప కులపతి డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి (77) హత్యతో కర్ణాటకలో పలు ప్రాంతాలలో ఆందోళనలు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ధర్నాలు చేస్తు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమించకూడదని కర్ణాటక ప్రభుత్వం భావించి కేసు సీఐడికి అప్పగించింది.
డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసును సీఐడికి అప్పగిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. హత్య చేసిన వారు ఎవరైనా సరే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి జార్జ్ దారవాడ చేరుకుని డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి పార్థివ శరీరానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివారం ఇంటిలో ఉన్న కలబుర్గిని దుండగులు రివాల్వర్ తో కాల్చి అతి దారుణంగా హత్య చేశారు.












Click it and Unblock the Notifications