వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన.!ఈ నెల 26న ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న కార్మిక సంఘాలు.!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వానికి కార్మిక సంఘాల సెగ తగలబోతోంది. ఇటీవల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమాత్రం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేవిగా లేని, ప్రధానంగా కరోనా క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు వ్యాక్సీన్ పంపిణీ చేయడంలో మోదీ పూర్తిగా విఫలం చెందారని ఘాటుగా విమర్శించాయి ట్రేడ్ యూనియన్లు. రైతు వ్యతిరేక చట్టాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం కుదేలయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున ఆ మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

26న ట్రేడ్ యూనియన్ల నిరసన..మోదీ ప్రజావ్యతరేక విధానాలకు పాల్పడుతున్నారన్న యూనియన్లు..

26న ట్రేడ్ యూనియన్ల నిరసన..మోదీ ప్రజావ్యతరేక విధానాలకు పాల్పడుతున్నారన్న యూనియన్లు..

అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ అవంలభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న ఢిల్లీ లో నిరసన చేపడతామన ట్రేడ్ యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న నిరసన చేపట్టాలని, దేశంలోని పది ప్రధాన ట్రేడ్​ యూనియన్లు నిర్ణయించినట్టు యూనియన్ నాయకులు స్పష్టం చేసారు. ఉచిత వ్యాక్సినేషన్​, నూతన సాగు చట్టాల రద్దు వంటివి యూనియన్ల ప్రధాన డిమాండ్లుగా ఉన్నట్టు వారు తెలిపారు.

బ్లాక్​ డే ఫర్ ఇండియన్​ డెమొక్రసీ పేరుతో నిరసన.. పాల్గొననున్న 10 ప్రధాన కార్మిక సంఘాలు..

బ్లాక్​ డే ఫర్ ఇండియన్​ డెమొక్రసీ పేరుతో నిరసన.. పాల్గొననున్న 10 ప్రధాన కార్మిక సంఘాలు..

బ్లాక్​ డే ఫర్ ఇండియన్​ డెమొక్రసీ పేరుతో నిరసన చేపట్టాలని దేశంలోని పది ట్రడ్ యూనియన్ల ఐక్య వేదిక నిర్ణయించింది. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో ఈ నెల 26 ప్రభుత్వానికి తమ నిరసన గళం వినిపించనున్నట్లు తెలిపాయి. కరోనా రెండోదశ క్లిష్ట సమయంలో కోవడ్ నియంత్రణ చర్యల్లో దేశం వెనకబడిపోయిందని, అందుకే అనేకమంది మరణిస్తున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు ఉందని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు.

ఆరు ప్రధాన డిమాండ్లు.. కేంద్రం స్పందించకపోతే నిరసన ఉదృతం చేస్తామన్న యూనియన్ నేతలు..

ఆరు ప్రధాన డిమాండ్లు.. కేంద్రం స్పందించకపోతే నిరసన ఉదృతం చేస్తామన్న యూనియన్ నేతలు..

నిరసన తెలపాలనుకుంటున్న ప్రదాన యూనియన్లు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు ఉంచబోతున్నాయి. 1) అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయలని, 2)పేదలకు ఉచిత రేషన్​, 3)నెలవారీ ఖర్చులకు 7,500 రూపాయల నగదు. 4)మూడు నూతన సాగు చట్టాల రద్దు, 5)పంటకు కనీస మద్దతు ధర,
6)గత ఏడాది పార్లమెంట్​లో ఆమోదం పొందిన నూతన కార్మిక చట్టాల ఉపసంహరణ వంటి డిమాండ్లను మోదీ సర్కార్ ముందు ఉంచబోతున్నాయి పలు యునియస్లు. మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం చేస్తామని యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

వ్యాక్సీన్ అందించడంలో మోదీ విఫలం.. మండిపడుతున్న కార్మిక సంఘాలు..

వ్యాక్సీన్ అందించడంలో మోదీ విఫలం.. మండిపడుతున్న కార్మిక సంఘాలు..

ఇక సమ్మెకు పిలుపునిచ్చిన ట్రేడ్​ యూనియన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నేషనల్​ ట్రేడర్​ యూనియన్ కాంగ్రెస్​ (ఐఎన్​టీయూసీ), ఆల్​ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్​ (ఏఐటీయూసీ), హింద్​ మజ్దూర్​ సభా (హెచ్​ఎంఎస్​), సెంటర్ ఆఫ్​ ఇండియన్ యూనియన్​ (సీఐటీయూ), ఆల్​ ఇండియా యూనైటెడ్​ ట్రేడ్​ యూనియన్​ సెంటర్​ (ఏఐయూటీయూసీ), ట్రేడ్​ యూనియన్​ కో-ఆర్డినేషన్​ సెంటర్ (టీయూసీసీ), సెల్ఫ్​​ ఎంప్లాయిడ్​ ఉమెన్స్​ అసోసియేషన్​ (సెవా), ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ ట్రేడ్ యూనియన్స్​ (ఏఐసీసీటీయూ), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్​పీఎఫ్​), యునైటెడ్​ ట్రేడ్​ యూనియన్​ కాంగ్రెస్​ (యూటీయూసీ)మొదలగు యూనియస్లు నిరసన తెలపబోతున్నట్టు యూనియన్ నాయకులు తెలియజేస్తున్నారు.

English summary
Union leaders have made it clear that the country's top 10 trade unions have decided to protest against the Modi government's decision on May 26. They said free vaccination and the repeal of new cultivation laws were the main demands of the unions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X