విద్యార్థినులపైకి వీర్యం నింపిన బెలూన్లు: ఢిల్లీలో ధర్నా
న్యూఢిల్లీ: లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థినిపైకి ఢిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థినులపైకి వీర్యం నింపిన బెలూన్లు విసురుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ జీసస్ అం్ మేరీ కాలేజీ విద్యార్తులు, టీచర్లు గురువారం ధర్నా చేశారు.
ఢిల్లీ పోలీసు కేంద్ర కార్యాలయం వద్ద వారు ధర్నాకు దిగారు. కళాశాలల్లోనూ, వెలుపలా తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్లకార్డులు ధరించి ఆందోళనకు దిగారు.

వీర్యం నింపిన బెలూన్ల నుంచి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆగ్రహంతో గొంతెత్తుదాం వంటి నినాదాలు రాసిన పోస్టర్లను ప్రదర్శించారు.హోలీ పేరుతో కొంత మంది దుండగులు వేధిస్తున్నారని ఆరోపించడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు.
తనపైకి వీర్యం నింపిన బెలూన్లు విసిరారని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని తన మిత్రురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇటువంటి అనుభవం మరింత మంది విద్యార్థినులకు కూడా ఎదురైందని అధికారవర్గాలు గుర్తించాయి.












Click it and Unblock the Notifications