వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాలీవుడ్ సినిమా కన్నా తక్కువ, గర్విస్తున్నా: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఎస్పీఎస్ నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ కేంద్రం నుండి పీఎస్ఎల్వీ సీ23 విజయవంతమైన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. హాలీవుడ్‌లో తీసిన గ్రావిటీ సినిమా కన్న మన చంద్రయాన్ ప్రయోగం ఖర్చు తక్కువ అని కితాబిచ్చారు. పీఎస్ఎల్వీ సీ23 విజయవంతం కావడం పట్ల షార్ శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ... సాంకేతిక రంగంలో మనం ముందుకు వెళ్తున్నామన్నారు. సొంత నావిగేషన్ వ్యవస్థను సమకూర్చుకోవడం గర్వకారణమన్నారు. ఆర్యభట్ట నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు. ఓ హాలీవుడ్ సినిమా ఖర్చు కంటే మన చంద్రయాన్ ప్రయోగం ఖర్చు తక్కువ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మనం అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నామన్నారు.

PSLV: Mission cost less than Hollywood movie 'Gravity', Kudos!: Narendra Modi

ఈ ప్రయోగంతో అగ్రదేశాల సరసన భారత్ చేరిందని నిర్ధారణ అయిందన్నారు. ఈ విజయం ప్రతి భారతీయుడి గౌరవం పెంచుతుందని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్ ప్రయోగం భారత్‌కు సొంతమన్నారు. మనం అనుకున్నట్లుగా, కచ్చితంగా ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశ పెట్టామన్నారు. సొంత నావిగేషన్ వ్యవస్థకు ఇది దోహదపడుతుందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ది సుదీర్ఘ ప్రయాణమన్నారు.

మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి భారత్ సత్తాను చాటారన్నారు. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తల కృషి దేశ ప్రజల జీవితాలను మారుస్తుందన్నారు. ఈ గొప్ప విజయానికి తాను ప్రత్యక్ష సాక్షిని అయినందుకు గర్వంగా ఉందని చెప్పారు. మనది అంతరిక్ష ప్రయోగాల్లో సుదీర్ఘ ప్రయాణమన్నారు. తొలి ప్రయోగం ఆర్యభట్ట బెంగళూరు షెడ్డూలో తయారయిందన్నారు. మనం మామూలు స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకున్నామన్నారు.

<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTU5MjI1fHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

సార్క్ శాటిలైట్స్ అభివృద్ధి చేయాలని మోడీ శాస్త్రవేత్తలను కోరారు. పక్క దేశాలకు ఉపయోగపడే శాటిలైట్లను రూపొందించి సార్క్ దేశాలకు బహుమతిగా ఇద్దామన్నారు. నిన్నటి నుండి తాను షార్‌లోనే ఉన్నానని, నాలుగు తరాల శాస్త్రవేత్తలను చూశానని చెప్పారు. యువతను పెద్ద ఎత్తున అంతరిక్ష రంగంలోకి తీసుకు రావాల్సిన అవసరముందని చెప్పారు. స్కేల్, స్కిల్, స్పీడ్‌కు భారత అంతరిక్ష రంగం నిదర్శనమన్నారు.

English summary
Narendra Modi congratulates the scientists for a successful launch."Fills every Indian's heart with pride. India's advanced space program puts her within the global space research," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X