సైకాలజిస్టుపై కత్తితో దాడి, సజీవ దహనం

వివరాల్లోకి వెళితే.. చెన్నై నగరానికి చెందిన పలువురు పరాంగుశపురంలోని ఆశ్రమ ఫౌండేషన్ పేరిట మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాన్ని(ఆశ్రమాన్ని) నాలుగేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలోనే మద్యం బానిసలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టుగా పాండియరాజన్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే కేంద్రంలో జాకబ్ కూడా అతని వద్ద కౌన్సెలింగ్ తీసుకుని ప్రస్తుతం అక్కడే ఓమ్నీ వ్యాన్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సైకాలజిస్టు పాండియరాజన్, జాకబ్‌లు ఆశ్రమంలోని ఒకే గదిలో ఉంటున్నారు.
కాగా యధావిధిగా ఆశ్రమాన్ని ఉదయం ఆరు గంటలకు తెరవాల్సి ఉండగా, సైకాలజిస్టు పాండియరాజన్, జాకబ్ ఉంటున్న గది 7గంటల వరకు తెరచుకోలేదు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో ఉంటున్న కొందరు పాండియరాజన్ గది తలుపులు తట్టారు. గది నుంచి రక్తం బయటికి రావడాన్ని గమనించిన ఆశ్రమం నిర్వాకులు మప్పేడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా అప్పటికే పాండియరాజన్ కాలిన శరీరంతో మృతి చెందాడు.
అక్కడికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాకబ్.. పాండియరాజన్ తలపై కత్తితో బలంగా నరికి ఆ తర్వాత అతనికి నిప్పుపెట్టినట్లు గుర్తించారు. పాండియరాజన్ బీరువాలోని రూ. 18వేలు, ఆశ్రమ వ్యాన్ కూడా కనిపించకపోవడంతో అదే వ్యాన్‌లో నిందితుడు జాకబ్ పారిపోయినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications