PUB: మాజీ ఎంపీ కొడుకును పార్టీకి పిలిచారు, పబ్ లో రామ్ చరణ్ నాయక్ సినిమా సీన్, పెట్టింది తినాలి !
బెంగళూరు: పబ్ లో స్నేహితులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులు అందరూ కలిసిన సమయంలో పాత విషయాలు మాట్లాడుకుంటూ పబ్ లో కాలం గడుపుతున్నారు. పక్క టేబుల్ లో మాజీ ఎంపీ కొడుకు, అతని స్నేహితులు పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో రెండు టేబుల్స్ లో కుర్చున్న యువకులు పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. పార్టీ పూర్తి అయ్యే సమయంలో మా పబ్ కు మీరు రావాలని, మేము ఇచ్చే పార్టీలో భాగం అవ్వాలని, మీరు మాతో కలిసి ఎంజాయ్ చెయ్యాలని, మేము ఇచ్చే పార్టీ ఎలా ఉంటుందో చెప్పాలని కొందరు మాజీ ఎంపీ కొడుకు, అతని స్నేహితులకు చెప్పారు. పార్టీకి పిలిచారని మాజీ ఎంపీ కొడుకుతో పాటు అతన్ని స్నేహితులు ఫ్రెండ్స్ పిలిచిన పార్టీలో ఎంజాయ్ చెయ్యడానికి పబ్ కు వెళ్లారు. అక్కడ అందరూ మద్యం సేవించారు. మద్యం సేవించే సమయంలో సైడ్ డిష్ ఆర్డర్ ఇచ్చే విషయంలో పార్టీకి ఆహ్వానించిన యువకులు, పార్టీకి వెళ్లిన మాజీ ఎంపీ కొడుకు మధ్య మాటామాటా పెరిగిపోయింది. అప్పుడు కథ రసవత్తరంగా మారింది. రేయ్, మేము పార్టీకి పిలిచాము, మేము పెట్టింది మొత్తం తిన్న తరువాతే ఇక్కడి నుంచి కదలాలి, మేము ఏమి పెడితే అది మొత్తం తిని బయట కాలు పెట్టాలి అంటూ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో జయప్రశాష్ రెడ్డి కామిడి కింగ్ బ్రహ్మానందంకు ఎలా వార్నింగ్ ఇచ్చాడో అలాగే పార్టీ ఇచ్చిన యువకులు మాజీ ఎంపీ కొడుకు మీద రెచ్చిపోయారని తెలిసింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో పార్టీకి పిలిచిన యువకులు మాజీ ఎంపీ కొడుకు, అతని స్నేహితులను చితకబాదేయడంతో ఐటీ హబ్ లోని విదాన సౌధ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

వ్యాపారం చేస్తున్న మాజీ ఎంపీ కొడుకు
కర్ణాటకలోని దావణగెరె మాజీ ఎంపీ మంజునాథ్ కు రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది, మాజీ ఎంపీ కుమారుడు చంద్రశేఖర్ కున్నూర్ బెంగళూరులోనే నివాసం ఉంటున్నాడు. మాజీ ఎంపీ మంజునాథ్ కు బెంగళూరులో ఇళ్లు ఉంది. వ్యాపారం చేస్తున్న మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ అతని స్నేహితులతో నిత్యం టచ్ లో ఉన్నాడు.

హోటల్ లో ఎంజాయ్
మాజీ ఎంపీ మంజునాథ్ కొడుకు, వ్యాపారవేత్త చంద్రశేఖర్ అతని స్నేహితులు ఇటీవల బెంగళూరులోని మీరజ్ హోటల్ కు వెళ్లారు. మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ అతని స్నేహితులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ అతని స్నేహితులు అందరూ కలిసిన సమయంలో పాత విషయాలు మాట్లాడుకుంటూ పబ్ లో కాలం గడుపుతున్నారు.

పార్టీ ఇస్తామని ఆహ్వానించిన యువకులు
మాజీ ఎంపీ చంద్రశేఖర్ కుర్చున్న పక్క టేబుల్ కొందరు యువకులు కుర్చున్నారు. ఆ సమయంలో మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్, అతని స్నేహితులు పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో రెండు టేబుల్స్ లో కుర్చున్న యువకులు పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ కాలం గడిపారు. పక్కటేబుల్ లో కుర్చున్న చేతన్ హెగ్డే, ప్రశాంత్ రెడ్డి తదితరులు మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ కు మా పబ్ లో పార్టీ ఇస్తామని చెప్పారు.

పార్టీకి ఎగరేసుకుంటూ వెళ్లారు
పార్టీ పూర్తి అయ్యే సమయంలో మా పబ్ కు మీరు రావాలని, మేము ఇచ్చే పార్టీలో భాగం అవ్వాలని, మీరు మాతో కలిసి ఎంజాయ్ చెయ్యాలని, మేము ఇచ్చే పార్టీ ఎలా ఉంటుందో చెప్పాలని చేతన్ హెగ్డే, ప్రశాంత్ రెడ్డి తదితరులు మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ కు, అతని స్నేహితులకు చెప్పారు.

పబ్ లో మాటామాటా పెరిగిపోయింది
పార్టీకి పిలిచారని మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ తో పాటు అతని స్నేహితులు యువరాజ్, ప్రసన్న, జయప్ప, శివప్రసాద్ తదితరులు ప్రశాంత్ రెడ్డి పిలిచిన పార్టీలో ఎంజాయ్ చెయ్యడానికి శివాజీనగర్ సమీపంలోని సూజి క్యూ క్లబ్ కు వెళ్లారు. అక్కడ అందరూ మద్యం సేవించారు. మద్యం సేవించే సమయంలో సైడ్ డిష్ ఆర్డర్ ఇచ్చే విషయంలో పార్టీకి ఆహ్వానించిన ప్రశాంత్ రెడ్డి, చేతన్ గౌడ తదితర యువకులు, పార్టీకి వెళ్లిన మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ తదితరుల మధ్య మాటామాటా పెరిగిపోయిందని సమాచారం.

నాయక్ సినిమా చూపించారని ఆరోపణలు
రేయ్, మేము పార్టీకి పిలిచాము, మేము పెట్టింది మొత్తం తిన్న తరువాతే ఇక్కడి నుంచి కదలాలి, మేము ఏమి పెడితే అది మొత్తం తిని బయట కాలు పెట్టాలి అంటూ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో జయప్రశాష్ రెడ్డి కామిడి కింగ్ బ్రహ్మానందంకు ఎలా వార్నింగ్ ఇచ్చాడో అలాగే పార్టీ ఇచ్చిన యువకులు చేతన్ గౌడ, ప్రశాంత్ రెడ్డి తదితరులు మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్, అతని స్నేహితుల మీద రెచ్చిపోయారని తెలిసింది.

పబ్ లో నుంచి తప్పించుకున్నాడు
ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో పార్టీకి పిలిచిన చేతన్ గౌడ, ప్రశాంత్ రెడ్డి తదితర యువకులు మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్, అతని స్నేహితులను చితకబాదేశారని ఆరోపణలు ఉన్నాయి. పబ్ లో నుంచి బయటపడిన మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ మొదట హోస్సళ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

కేసు పెట్టిన మాజీ ఎంపీ కొడుకు
పోలీసులకు ఫోన్ చేసిన తరువాత మాజీ ధారవాడ మాజీ ఎంపీ మంజునాథ్ కొడుకు చంద్రశేఖర్ బెంగళూరులోని విదాన సౌధ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మాజీ ఎంపీ కొడుకు చంద్రశేఖర్ మీద దాడి చేసిన యువకులు అందరూ తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications