ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: ఆ టైంలో పని చేయలేం కానీ.. మహిళా టెక్కీలు
25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య నేపథ్యంలో పుణేలోని మహిళా ఉద్యోగినులు స్పందించారు. తాము నైట్ షిఫ్టులలో వర్క్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
పుణే: 25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య నేపథ్యంలో పుణేలోని మహిళా ఉద్యోగినులు స్పందించారు. తాము నైట్ షిఫ్టులలో వర్క్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా వీకెండ్స్‌లో ఆఫీస్ దాదాపు ఖాళీగా ఉంటుందని, అప్పుడు మరీ ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఖాళీగా ఉన్న కార్యాలయంలో పని చేయలేకపోతున్నామని, కానీ ఏం చేయలేని పరిస్థితి అని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, రసిలా రాజు అంత్యక్రియలు కేరళలోని కోజికోడ్‍లో జరిగాయి. ఆమె అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు.
ఆమె మృతదేహాన్ని ఉదయం ముంబై నుంచి విమానంలో కేరళ తీసుకు వచ్చారు. రసిలా రాజు తల్లి రెండేళ్ల క్రితమే మృతి చెందారు. ఆమె తండ్రి మాజీ సైనిక ఉద్యోగి. ఆమె సోదరుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications