మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడంటే..
ఓ మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీసిన కానిస్టేబుల్ ఉదంతమిది. ఈ ఘటన సోమవారం పూణేలో చోటుచేసుకుంది.
పూణే: ఓ మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీసిన కానిస్టేబుల్ ఉదంతమిది. ఈ ఘటన సోమవారం పూణేలో చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే... చత్రుష్రుంగి పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ సోమవారం ఉదయం తన ఇంటి బాత్రూంలో స్నానం చేస్తోంది. అదే ప్రాంతంలో కానిస్టేబుల్ సమీర్ పటేల్ కూడా నివసిస్తున్నాడు.
ఆ బాత్రూంకి ఉన్న కిటికీలోంచి అతడు ఆమె స్నానం చేస్తున్న దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్ ద్వరా వీడియో తీయసాగాడు. ఇది గమనించిన మహిళా కానిస్టేబుల్ అతడ్ని గద్దించడమే కాక వాగ్వివాదానికి దిగింది.

ఈ నేపథ్యంలో సమీర్ కుటుంబ సభ్యులు మహిళా కానిస్టేబుల్ తో గొడవపడడమే కాక ఆమెపై దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అనంతరం చత్రుష్రుంగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు ఖడక్ పోలీసుస్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సమీర్ పటేల్ ను అరెస్టు చేసినట్లు సీఐ దయానంద్ ధోమ్ తెలిపారు. దీంతోపాటు మహిళా కానిస్టేబుల్ పై దాడికి దిగి ఆమెను గాయపరిచినందుకు అతడి భార్య, సోదరుడు, తల్లిపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications