దృశ్యం సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు లేవు కదా భయ్య..!

ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు, ముఖ్యంగా భార్యాభర్తల బంధాలు పూర్తిగా విలువ కోల్పోతున్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్న సంఘటన ఇది. వివాహేతర సంబంధాల మోజులో పడి, ఒక వ్యక్తి తన భార్యను హత్య చేయడానికి సినిమాటిక్ స్టైల్‌లో పకడ్బందీగా పథకం వేశాడు. మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసిన ఈ సంఘటన.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న అపనమ్మకాన్ని, క్రూరత్వాన్ని సూచిస్తోంది.

2017లో అంజలిని వివాహం చేసుకున్న సమీర్ జాదవ్ (భర్తకు)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలోకి ఒక యువతి ప్రవేశించింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారడంతో, భార్య అంజలి (ప్రైవేట్ స్కూల్ టీచర్) సమీర్‌కు అడ్డంకిగా కనిపించడం మొదలైంది.

Pune Shocker Husband Burns Wife to Ashes in Drishyam Style Murder Plot Over Extramarital Affair

ఆమెను వదిలించుకోవడానికి సమీర్ భయంకరమైన ప్లాన్ రచించాడు. తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు, తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని నమ్మించేందుకు స్నేహితుల ద్వారా ఆమెకు తప్పుడు మెసేజ్‌లు పంపించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు రోజు గొడవలు పడేవాడు.

ఈ హత్య కోసం సమీర్ నెల రోజులు ముందు నుంచే సిద్ధమయ్యాడు. గోడౌన్‌ను అద్దెకు తీసుకోవడం, అక్కడ ఇనుప పెట్టెను తయారు చేయించడం, వంటచెరకును సిద్ధంగా ఉంచుకోవడం.. ఇదంతా సినిమా స్క్రిప్ట్‌ను తలపించింది. అక్టోబర్ 26వ తేదీన సమీర్ తన భార్యను కొత్తగా అద్దెకు తీసుకున్న వేర్ హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ గొడవ తారాస్థాయికి చేరడంతో అత్యంత కిరాతకంగా ఆమె గొంతు నులిమి చంపేశాడు.

'దృశ్యం' తరహాలో సాక్ష్యాల మాయం
హత్య తర్వాత సాక్ష్యాలు లేకుండా చేయడానికి సమీర్ మరింత దారుణానికి ఒడిగట్టాడు. అంజలి మృతదేహాన్ని ఆ పెద్ద ఇనుప డబ్బాలో వేసి పూర్తిగా కాల్చి బూడిద చేశాడు. తెల్లారే లోపే ఆ బూడిదను తీసుకెళ్లి నదిలో పారేసి, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ తర్వాత, తన భార్య ఫోన్ నుంచే ఆమె మగ స్నేహితుడికి 'ఐ లవ్ యూ' అంటూ మెసేజ్‌లు పంపి.. ఆమె పరారైందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత సమీరే పోలీసులకు ఫిర్యాదు చేయగా, అంజలి అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సమీర్ ప్రవర్తనలో తేడా గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, ఈ దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల వివరాల ప్రకారం..నిందితుడు హత్యకు నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసి, గోడౌన్ కోసం నెలకు రూ. 18,000 అద్దె చెల్లించాడు. అక్కడే ఇనుప పెట్టెను తయారు చేయించి, వంటచెరకును సిద్ధం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+