క్యాబ్ లో వెళ్ళకపోవడమే ఆమె మరణానికి కారణమైంది
పుణెలో ఓ పనిచేసే అంతారదాస్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ ను గుర్తుతెలియని వ్యక్తి ఒకరు కత్తితో పొడిచి చంపాడు. గతంలో ఆమెను బెంగుళూరులో ఫాలో అయిన వ్యక్తే చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
పుణె : ఆమె రోజు మాదిరిగానే క్యాబ్ లో వెళితే బతికి ఉండేది.కాని, ఆమె క్యాబ్ లో వెళ్ళకుండా నడిచి వెళ్ళడం ఆమె ప్రాణాలకు ముప్పుతెచ్చింది.అయితే ఆమెను వెంటాడిన వ్యక్తే ఆమెను చంపాడని చనిపోయిన టెక్కీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పుణెలోని క్యాప్ జెమిని అనే కంపెనీలో కోల్ కతాకు చెందిన అంతారదాస్ అనే యువతి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.శుక్రవారం రాత్రి ఆమె విధులను ముగించుకొని బయటకు రాగానే గుర్తు తెలియని నిందితుడు ఆమెపై కత్తితో దాడిచేసి హతమార్చాడు. అయితే నిందితుడి నుండి బాదితురాలిని కాపాడేందుకు
ఓ స్కూటరిస్టు చేసిన ప్రయత్నం విఫలమైంది. స్కూటరిస్టు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు గుర్తించారు.

అంతారదాస్ కార్యాలయం నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమె కోసం ఎదురుచూస్తోన్న నిందితుడు కత్తితో పొడిచాడు.అయితే నిందితుడి నుండి తప్పించుకొని ఆ యువతి పారిపోయింది.అయినా ఆమెను వెంటాడి కత్తితో గాయపర్చాడు. దారిలో వెళ్తున్న స్కూటరిస్తు నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేశాడు. అయితే అతను తప్పించుకొని పోయాడు.
అయితే అంతారదాస్ బెంగుళూర్ లో శిక్షణ తీసుకొనే సమయంలో ఆమె వెంటపడే వ్యక్తే పుణెకు వెళ్ళి హత్య చేసి ఉంటాడని అంతారదాస్ తండ్రి ఆరోపించాడు. నిందితుడు వేసుకొన్న డ్రస్, ఇతర ఆనవాళ్ళను స్కూటరిస్టు పోలీసులకు వివరించాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.అయితే ప్రతిరోజూ క్యాబ్ లో వెళ్ళే ఆ యువతి ఆ రోజు ఎందుకు క్యాబ్ లో వెళ్ళలేదనేది అర్థం కావడం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే క్యాబ్ లో వెళ్తే ఆమె ప్రాణాలు దక్కేవని కుటుంబసభ్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications