వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పునీత్ హఠాన్మరణం.. దిగ్బ్రాంతికి గురిచేసింది: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

శాండల్ వుడ్ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం దిగ్బ్రాంతికి గురిచేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అప్పు అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులుకు, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. గుండె పగిలినంత పనైందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు సోదరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో విడుదలైన పునీత్ రాజ్ కుమార్ చిత్రం 'చక్రవ్యూహ'లో జూనియర్ ఎన్టీఆర్ 'గెలియా గెలియా' అనే గీతాన్ని ఆలపించారు. ఇందుకుగాను ఎన్టీఆర్‌కు 'మిర్చి మ్యూజిక్ అవార్డు' కూడా లభించింది.

puneet raj kumar demise huge loss to kannda film industry

ఇటు కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం స్వల్పంగా గాయపడ్డారు. కుప్పంకు వెళ్లే క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లాల్సి ఉంది. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు యత్నించారు. చంద్రబాబు చేతికి అనుకోకుండా స్వల్ప గాయమయింది. ఆ తర్వాత చంద్రబాబు అక్కడి నుంచి కుప్పంకు బయల్దేరి వెళ్లారు. రేపటి వరకు చంద్రబాబు కుప్పం పర్యటన కొనసాగనుంది. ప్రస్తుతం ఆయన కుప్పం బస్టాండ్ సెంటర్ వద్ద ప్రసంగిస్తున్నారు.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు పునీత్. చిన్న కుమారుడు అయినా.. బాల్య నటుడిగా కూడా నటించారు. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో వీరప్పన్ బృందంతో పునీత్ చర్చలు జరిపారని అంటారు. పెద్ద మొత్తంలో నగదు కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం.

English summary
kannada power star puneet raj kumar demise huge loss to kannda film industry tdp chief chandrabau naidu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X