Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు, ఆలోచిస్తున్నాం, సీఎం బోమ్మయ్ !

బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) చిన్న వయసులోనే అందరికి దూరం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, కన్నడిగులు ఆయన దూరం అయిన విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ సినీ రంగంలో ఉంటూ కళామతల్లికి సేవలు చెయ్యడమే కాకుండా ఆయన చేసిన సమాజసేవ గురించి ఆయన మరణం తరువాత ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. అనాథ ఆశ్రమాలు, వృద్దాశ్రమాలు, నిరుపేదలకు విద్యాదానం, వికలాంగుల కోసం పునీత్ రాజ్ కుమార్ ఎలాంటి ప్రచారం లేకుండా ఆయన సైలెంట్ గా సహాయం చేశారు. హీరోగా సినిమాల్లో నటిస్తూ డబ్బు సంపాధించడమే కాకుండా ఆయన ఆడబ్బును పేదలు, అనాథల కోసం చాలా ఖర్చు చేశారు. ఇప్పుడు శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఆయన మరణానంతరం కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల మనవి మేరకు, ఆయన ఇంతకాలం చేసిన సమాజసేవను గుర్తించి కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని, అందరితో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కర్ణాటక అవతరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఈ మాట చెప్పడంతో ఆయన అభిమానులు, కన్నడిగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 స్టార్ హీరో..... కాని చాలా సింపుల్

స్టార్ హీరో..... కాని చాలా సింపుల్

శ్యాండిల్ వుడ్ లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. అభిమానులను ఏమాత్రం నిరాశపరచకుండా పునీత్ రాజ్ కుమార్ చాలా సినిమాల్లో నటించారు. బాల నటుడిగా తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ వారసత్వం స్వీకరించిన పునీత్ రాజ్ కుమార్ తరువాత స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.

 నటుడు మాత్రమే కాదు అప్పు సింగర్ కూడా

నటుడు మాత్రమే కాదు అప్పు సింగర్ కూడా

అభిమానులతో ముద్దుగా అప్పు అని పిలిపించుకునే పునీత్ రాజ్ కుమార్ కోట్లాది మంది అభిమానులను సంపాధించుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ తో సినిమా తీసి మేము నష్టపోయాము అని ఇంత వరకు ఏ నిర్మాత చెప్పలేదు అంటే ఆయనకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. నటుడిగానే కాకుండా సింగర్ గా కూడా పునీత్ రాజ్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. డాక్టర్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా వందాలది పాటు పాడి గానగంధ్వరుడు అని పేరు తెచ్చుకున్నారు

 జీర్ణించుకోలేకపోతన్న ఫ్యాన్స్, కన్నడిగులు

జీర్ణించుకోలేకపోతన్న ఫ్యాన్స్, కన్నడిగులు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) చిన్న వయసులోనే అందరికి దూరం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, కన్నడిగులు ఆయన దూరం అయిన విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ సినీ రంగంలో ఉంటూ కళామతల్లికి సేవలు చెయ్యడమే కాకుండా ఆయన చేసిన సమాజసేవ గురించి ఆయన మరణం తరువాత ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.

 ప్రచారం లేకుండా సమాజసేవ చేసిన పునీత్ రాజ్ కుమార్

ప్రచారం లేకుండా సమాజసేవ చేసిన పునీత్ రాజ్ కుమార్

అనాథ ఆశ్రమాలు, వృద్దాశ్రమాలు, నిరుపేదలకు విద్యాదానం, వికలాంగుల కోసం పునీత్ రాజ్ కుమార్ ఎలాంటి ప్రచారం లేకుండా ఆయన సైలెంట్ గా సహాయం చేశారు. హీరోగా సినిమాల్లో నటిస్తూ డబ్బు సంపాధించడమే కాకుండా ఆయన ఆడబ్బును పేదలు, అనాథల కోసం చాలా ఖర్చు చేశారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తరువాత చాలా మందికి ఆయన ఇంతకాలం చేసిన సమాజా సేవ గురించి తెలిసింది.

 కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని !

కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని !

శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఆయన మరణానంతరం కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల మనవి మేరకు, ఆయన ఇంతకాలం చేసిన సమాజసేవను గుర్తించి కర్ణాటక రత్న అవార్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని, అందరితో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

 కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు

కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు

కర్ణాటక అవతరణ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఈ మాట చెప్పడంతో ఆయన అభిమానులు, కన్నడిగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే కర్ణాటక రత్న అవార్డు ఇంతకు ముందు ఎంతో మంది ప్రముఖులు తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించిన తరువాత ఆయనకు కర్ణాటక రత్నం అవార్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు. కన్నడ రాజ్యోత్సవం (నవంబర్ 1వ తేది)న ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ బెంగళూరులో స్వయంగా ఈ విషమం మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+