వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ లో నువ్వా నేనా : ఆప్ వర్సెస్ కాంగ్రెస్ : సిద్దూ వెనుకంజ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పంజాబ్ లో ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలు పెట్టారు. పంజాబ్ లో జరిగిన బహుముఖ పోరులో ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు ఏకపక్షంగా విజయం ఖాయమని అంచనా వేసారు. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే, పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం ఆప్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు సాధిస్తున్నాయి. ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.

తాజా అప్ డేట్స్ ప్రకారం పంజాబ్ లో ఇప్పటి వరకు ఆప్ 32 సీట్లలో పోస్టల్ బ్యాలెట్ తో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. శిరోమణి అకాలీ దళ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఏడు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక, బీజేపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయింది. ముఖ్యమంత్రి చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ముందంజలో ఉండగా.. సిద్దూ వెనుకంజలో ఉన్నట్లుగా రిపోర్టులు అందుతున్నాయి. అయితే , పోస్టల్ బ్యాలెట్ లో వస్తున్న ఫలితాలు ట్రెండ్ ను స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

AAP and Congress neck to neck fight in punjab in postal ballot results

Recommended Video

Exit Polls 2022: Punjab లో AAP, Arvind Kejriwal మ్యాజిక్ Congress స్థానంలో ఆప్ | Oneindia Telugu

సిద్దూ అమ్రుత్ సర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ స్పష్టమైన ఆధిక్యతతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని నిలుస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే, 2017 ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అటు ఇటు మారుతాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసాయి. 2017 లో కాంగ్రెస్ సాధించిన సీట్లు ఇప్పుడు ఆప్..అదే విధంగా ఆ ఎన్నికల్లో ఆప్ సాధించిన సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని అంచనాలు వెలువడ్డాయి. ఇక, ఇప్పుడు ట్రెండ్స్ సైతం అదే విధంగా వస్తున్నట్లు కనిపిస్తోంది.

English summary
AAP and Congress neck to neck fight in punjab in postal ballot results
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X