పంజాబ్‌లో ఏపీ ఫార్ములా: జగన్ పథకాన్ని కాపీ కొట్టిన ఆమ్ ఆద్మీ: ఆ స్కీంను ప్రకటించిన సీఎం
చండీగఢ్: ఏపీలో విజయవంతంగా అమలవుతోన్న పథకాల్లో ఒకటి- ఇంటింటికీ రేషన్ డెలివరీ. చౌక ధరల డిపోల ద్వారా సరఫరా అయ్యే నిత్యావసర సరుకులను తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం గడప వద్దకు చేర్చడానికి ఉద్దేశించిన పథకం ఇది. ప్రారంభంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. కోర్టు కేసులనూ అధిగమించింది. ఇంటింటికీ రేషన్‌ను అందజేయడానికి ప్రభుత్వం కొత్తగా వాహనాలను సైతం కొనుగోలు చేసింది. వాటిని లబ్దిదారులకు అందజేసింది.

ఏపీ పథకం మరిన్ని రాష్ట్రాల్లో..
ఏపీ ఇచ్చిన స్ఫూర్తితో ఇంకొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి.. మరికొన్ని అమలు చేస్తామనీ ప్రకటించాయి. మధ్యప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని పాక్షికంగా అమలు చేస్తోంది. ఏజెన్సీ ఏరియాల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను చేరవేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటక కూడా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దీన్ని ప్రారంభించారు.

ఢిల్లీలో కొర్రీలు..
ఇదివరకు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ప్రకటించింది గానీ అది కార్యరూపాన్ని దాల్చలేదు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేనందున.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి మోకాలడ్డుతోందనేది ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న ఆరోపణ. లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్- ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని అమలు చేసే విషయంలో కొర్రీలు పెడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు.

పనులు మానుకొని బారులు తీరడం సరికాదు..
ఈ పరిణామాల మధ్య పంజాబ్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అదే పథకాన్ని అమలు చేయడానికి సమాయాత్తమైంది. ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. నిత్యావసర వస్తువుల కోసం పేదలు- తమ పనులను మానుకుని రేషన్ దుకాణాల వద్ద బారులు తీర్చి నిల్చోవడం సరికాదని, ఈ పరిస్థితిని రూపుమాపడానికి ఈ పథకాన్ని ప్రారంభించనున్నామని వ్యాఖ్యానించారు.

బ్యాగుల్లో సరుకులు..
ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే వాటిని లబ్దిదారుల ఇళ్లకు చేరవేస్తామని భగవంత్ మాన్ అన్నారు. బ్యాగుల్లో ప్యాక్ చేసి, వాటిని ప్రత్యేక వాహనాల ద్వారా లబ్దిదారులకు ఇంటి వద్దే అందజేస్తామని చెప్పారు. అలా కాదనుకున్న వారు- నేరుగా చౌక డిపోల వద్దకే వెళ్లి నిత్యావసర సరకులను తీసుకోవచ్చని వివరించారు. ఇది ఆప్షనల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తోన్నామని చెప్పారు.

స్వాగతించిన కేజ్రీవాల్..
కాగా- ఈ పంజాబ్‌లోని తమ పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం పట్ల ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భగవంత్ మాన్ చేసిన ఈ ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడానికి తాము నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తోన్నామని, కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతోందని అన్నారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా తాము అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ..కేంద్రం అనుమతి ఇవ్వట్లేదని చెప్పారు.

కేంద్రం మోకాలడ్డు..
కేంద్ర ప్రభుత్వం పథకాలను అమలు చేయడాన్ని అడ్డుకోగలుగుతుందేమో గానీ.. ఆలోచనా దృక్పథాన్ని కాదని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో రేషన్ డోర్ డెలివరీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ- ఫర్వాలేదని, పంజాబ్‌లో తాము దాన్ని అమలు చేస్తామని చెప్పారు. దేశం మొత్తం తమవైపు చూసేలా ఈ పార్టీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అది ఢిల్లీ అయినా పంజాబ్ అయినా ఒక్కటేనని అన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications