Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆసుపత్రిలో సీఎం అడ్మిట్: హుటాహుటిన రాజధానికి షిఫ్ట్..ఎయిర్‌లిఫ్ట్: ఆ నీళ్లు తాగడంతో

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తొలుత చండీగఢ్‌లోని ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడే చికిత్స పొందినప్పటికీ.. కడుపునొప్పి మాత్రం తగ్గలేదు. దీనితో హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల 17వ తేదీన ఆయన సుల్తాన్‌పూర్‌లోధీని సందర్శించారు. అక్కడ ప్రవహిస్తోన్న కాళీబెన్ నది నీటినీ తాగారు. కాలుష్యం వల్ల ఈ నదీజలాలు విషపూరితంగా తయారయ్యాయని, దీన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. ఈ నదీజలాలను శుద్ధి చేసి 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి భగవంత్ మాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 Punjab CM Bhagwant Mann was admitted to a hospital in Delhi after he suffers stomach ache.

ఈ సందర్భంగా కాళీబెన్ నదీ జలాలను తాగారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, వడపోయకుండా రెండు గ్లాసుల మేర ఈ నదీ జలాలను నేరుగా తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన చోటు చేసుకున్న రెండోరోజే భగవంత్ మాన్ అనారోగ్యానికి గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఆయన తొలుత చండీగఢ్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు.

 Punjab CM Bhagwant Mann was admitted to a hospital in Delhi after he suffers stomach ache.

అప్పటికీ కడుపునొప్పి తగ్గకపోవడంతో ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు డాక్టర్లు. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. త్వరలోనే మెడికల్ బులెటిన్ వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాళీబెన్ నదీ జలాలే ఆయన అనారోగ్యానికి కారణం అనే వార్తల పట్ల ప్రభుత్వం స్పందించట్లేదు.

 Punjab CM Bhagwant Mann was admitted to a hospital in Delhi after he suffers stomach ache.

కాగా- ప్రముఖ గాయకుడు సిద్ధు మూసెవాలా హత్యతో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న గ్యాంగ్ స్టర్ల ఎన్‌కౌంటర్ పట్ల భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. పోలీసులను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అమృత్‌సర్ సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో పంజాబ్ పోలీసులు ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను కాల్చి చంపిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+