వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 ల‌క్ష‌ల ఉద్యోగాలు కల్పిస్తా.. లేకుంటే రాజ‌కీయ‌ల‌కు గుడ్ బై.. బీజేపీ, ఆప్‌ నేతలకు సిద్ధూ స‌వాల్

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ తమ ఆస్త్రాలను ఉపయోగిస్తున్నాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మార్చేస్తానంటూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ హామీలు గుప్పిస్తున్నారు . ఈసారి ఐదు లక్షల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్నారు. ఇవ్వకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్ధూ స్పష్టం చేస్తున్నారు.

పంజాబ్ మోడ‌ల్‌..

పంజాబ్ మోడ‌ల్‌..

పంజాబ్ ప్రజలు వారి ఆశలు నేరవేర్చే సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. ఇందుకు తాము సిద్ధం చేసిన 'పంజాబ్ మోడల్' ఒక్కటే సరైన మార్గమని.. తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు వీలైన సమగ్ర వ్యూహంతో ఈ ప్లాన్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ప‌ఘ్వారా ఎమ్మెల్యే బ‌ల్వీంద‌ర్ సింగ్ ధ‌లివాల్ ఏర్పాటు చేసిన ర్యాలీలో సిద్ధూ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద‌ల సంక్షేమం కోసం 13 సూత్రాల కార్య‌క్ర‌మాన్ని ముందుకు తెచ్చామని చెప్పారు.

 2. 5 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వ‌కుంటే రాజ‌కీయాల నుంచి తప్పుకుంటా..

2. 5 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇవ్వ‌కుంటే రాజ‌కీయాల నుంచి తప్పుకుంటా..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 5 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. తీసుకురాకుంటే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని నవజ్యోత్ సింగ్ సిద్ధూ పున‌రుద్ఘాటించారు. బీజేపీ ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బీజేపీలో చేరని వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలచే దాడులు చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోప‌ణ‌లు గుప్పించారు.

దిగ‌జారుడు రాజ‌కీయాలు

దిగ‌జారుడు రాజ‌కీయాలు

ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీ, ఆప్, ఎస్ఏడీ దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నాయని సిద్ధూ ఆరోపించారు. రైతుల నుంచి ప్రతిఘటన తప్పదన్న భయంతో జలంధర్‌లో పార్టీ కార్యాలయాన్ని కూడా బీజేపీ ఏర్పాటు చేయడంలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో 22వేల మంది ఉపాధ్యాయులు రోడ్డు పడితే వారి సమస్యలను వినేందుకు కూడా సీఎం క్రేజీవాల్ ప్రయత్నించడంలేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్న సిద్ధూ సీఎం అభ్యర్థి రేసులో తాను ఉన్నానంటూ ప్రజలల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు.

సిద్ధూ కోసం హోం మంత్రి ప‌ద‌వి వ‌దులుకుంటా..

సిద్ధూ కోసం హోం మంత్రి ప‌ద‌వి వ‌దులుకుంటా..


మరో వైపు సిద్ధూ వైఖరిపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దూ కోరితే తన హోం మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆరాష్ట్ర హోంమంత్రి, సుఖీందర్ సింగ్ రంధావా మండిపడ్డారు. తాను హోం మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి సిద్దూ ఆసంతృప్తితో రగిలిపోతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Navjot Singh Sidhu Warning to BJP, AAP Leaders in Punjab Election Campaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X