వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరువు నష్టం దావా వేస్తా.. కేజ్రీవాల్‌పై పంజాబ్ సీఎం చన్నీ

|
Google Oneindia TeluguNews

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఎవరికీ వారు తమ లెక్కలు వేసుకొని.. ముందడుగు వేస్తున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ అన్నారు. తన మేనల్లుడిపై ఐటీ దాడులుకు సంబంధించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నిజాయితీ లేని వారు అని కేజ్రీవాల్ అనడంపై చన్నీ ఫైరయ్యారు. అతనిపై దావా వేస్తానని చెప్పారు.

తన విషయంలోనే కాదు ఇతరుల విషయంలోనూ కేజ్రీవాల్ కూడా అలానే వ్యవరహించారని తెలిపారు. ఇదివరకు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, శిరోమణి అకాలిదల్ నేత బిక్రమ్ సింగ్ మాజితియాపై ఆరోపణలు చేశారని వివరించారు. ఇప్పటికే కేజ్రీవాల్ తన పరిధి దాటి పోయారని చెప్పారు. పరువు నష్టం దావాకు సంబంధించి.. పార్టీని అనుమతి కోరానని చెప్పారు.

Punjab Elections 2022: CM Channi to file defamation case against Delhi CM Arvind Kejriwal

చన్నీ మేనల్లుడి ఇంటిపై ఐటీ దాడుల తర్వాత కేజ్రీవాల్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న కేజ్రీవాల్ చన్నీపై విమర్శలు చేశారు. చాంకౌర్ సాహిబ్ నుంచి చన్నీ ఓడిపోతాడని కేజ్రీవాల్ అన్నారు. ఐటీ దాడులలో కోట్లాది రూపాయలు వెలుగు చూశాయని.. ఈ సొమ్ము ఎక్కడిది అని ఆయన అడిగారు. నగదు ఇతరులది అని చన్నీ స్పందించారు. ఇతరులపై దాడి జరిగితే.. తన నిజాయితీని శంకించడం సరికాదు అని చన్నీ అన్నారు. అంతేకాదు నగదుతో తన ఫోటోలు జతచేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదన్నారు.

Recommended Video

Third Front: Tejaswi Yadav Meets CM KCR| 2024 Elections | BJP | Oneindia Telugu

ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగియనున్నాయి. జనవరి 30 వరకు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.

English summary
Punjab Chief Minister Charanjit Singh Channi on Friday said he would file a defamation case against AAP leader Arvind Kejirwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X