కేజ్రీవాల్ అబద్దాలకోరు; మాటమీద నిలబడడు: పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు, అరవింద్ కేజ్రివాల్ పెద్ద "అబద్ధాలకోరు" అని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే, ఆప్ రాష్ట్రంలో ఎటువంటి మార్పు తీసుకురాదని, వారి మాటలు నమ్మొద్దని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు.
Recommended Video

ఆప్ లో విప్లవకారులు ఎవరూ లేరు: చరణ్‌జిత్ సింగ్ చన్నీ
అన్ని చోట్ల నుండి తిరస్కరించబడిన వారని ఆప్ నాయకులను ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రోజు పంజాబ్ రాష్ట్ర ఎన్నికల తర్వాత మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కు బదులుగా, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే (పంజాబ్‌లో) ఎటువంటి మార్పు ఉండబోదని వెల్లడించారు. ఎందుకంటే అన్ని విధాలుగా తిరస్కరించబడిన రాజకీయ నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారని. ఆ పార్టీలో విప్లవకారులు ఎవరూ లేరని, తనను తాను భగత్ సింగ్ శిష్యుడిగా చెప్పుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ భగత్ సింగ్ శిష్యుడు కాదని పేర్కొన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ అబద్దాల కోరు: పంజాబ్ సీఎం చన్నీ
అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పే వ్యక్తి, అతను చాలా అబద్ధాలు మాట్లాడతాడు. అవసరమైతే తాను చేసిన ప్రకటనల మీద మళ్లీ ఫ్లిప్ కొడతాడని లేదా కొన్నిసార్లు క్షమాపణలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అభిప్రాయం వ్యక్తం చేశారు.మాటమీద నిలబడడని పేర్కొన్నారు. చమ్‌కౌర్ సాహిబ్ మరియు బదౌర్ నుండి తాను పోటీ చేస్తున్న రెండు స్థానాల నుండి మంచి ఆధిక్యంతో గెలుస్తున్నట్లు చన్నీ చెప్పారు.

పంజాబ్ ఎన్నికల్లో బహుముఖ పోటీ
ఈ ఎన్నికలలో, పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్ పార్టీ కూటమి మరియు బీజేపీ-మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రధారులుగా ఈసారి బహుముఖ పోటీని ఎదుర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్న ఎన్నికలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది. పంజాబ్లోని ఢిల్లీ మోడల్ పాలనను అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు వాగ్దానం చేసింది.

పంజాబ్ లో ఆమ్ ఆద్మీని టార్గెట్ చేస్తున్న ప్రధాన పార్టీలు
2014 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 2017 ఎన్నికలలో 20 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ పై పట్టు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తూ పంజాబీ ఎన్నికల రాజకీయాలు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవటం ప్రధాన సమస్యగా మారింది .

పంజాబ్ లో కేజ్రీవాల్ పై కొనసాగుతున్న రాజకీయ దుమారం
ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఖలిస్తానీ ఉగ్రవాదంటూ ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలతో పంజాబ్ లో మొదలైన రాజకీయ దుమారం రచ్చగా మారింది. అప్పటి నుండి అన్ని ప్రధాన పార్టీలు అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ లో జరుగుతున్న ఎన్నికలకు మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications