Punjab Elections 2022: నేటితో పంజాబ్ ఎన్నికల ప్రచారానికి తెర.. ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ వివరణ

పంజాబ్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీలు తలపడుతున్నాయి. ఫిబ్రవరి 20న షెడ్యూల్ చేయబడిన పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ప్రచారం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది కాబట్టి, ఎన్నికల సంఘం (EC) స్టార్ క్యాంపెయినర్లు తమ ఎన్నికల ప్రచారాన్ని సాయంత్రం ఆరు గంటల లోపు ముగించాలని పేర్కొన్నారు.

ఓటర్లు కాని వారు నియోజకవర్గాలను వదిలి వెళ్ళాలి : ఈసీ ఆదేశం

ఓటర్లు కాని వారు నియోజకవర్గాలను వదిలి వెళ్ళాలి : ఈసీ ఆదేశం

అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు ఇంటింటికీ నిశ్శబ్ద ప్రచారానికి వెళ్లవచ్చు. అయితే అన్ని ర్యాలీలు మరియు బహిరంగ సభలు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల లోపు ముగుస్తాయని ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ప్రధాన ఎన్నికల అధికారి, పంజాబ్, యస్ కరుణారాజు ప్రకారం ఓటరుగా నమోదు కాని రాజకీయ నాయకులు, కార్యకర్తలు లేదా పార్టీ కార్యకర్తలందరూ నిర్దిష్ట సమయం తర్వాత ఆయా నియోజకవర్గాలను వదిలి వెళ్ళవలసి ఉంటుందని పేర్కొన్నారు.

117 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్

117 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్

పంజాబ్ పోలీసులు మరియు సెంట్రల్ పారామిలిటరీ దళం సిబ్బంది బయటి వ్యక్తులు మరియు ఓటర్లు కానివారిని తరలించడానికి హోటళ్లు, లాడ్జీలు, కమ్యూనిటీ సెంటర్లు మరియు ఇతర ప్రదేశాలను తనిఖీ చేయడం ప్రారంభిస్తారని ఎన్నికల అధికారి వెల్లడించారు. రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య పోలింగ్ జరగనుంది. ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు, 23 జిల్లాల్లో శాంతిభద్రతలు, ఖర్చులు మరియు సాధారణ ప్రయోజనం కోసం ఎన్నికల కమిషన్ ముగ్గురు పరిశీలకులను నియమించింది. భద్రతా కవరేజీలో ఉన్న వారందరూ పోలింగ్ రోజు వరకు తాము నమోదైన ఓటరుగా ఉన్న నియోజకవర్గంలోనే ఉండాలని ఎన్నికల కమిషన్ కోరింది. రాజకీయ పార్టీల అధినేతలు తమ రాష్ట్ర పార్టీ కార్యాలయం మరియు నివాసం మధ్య మాత్రమే వెళ్లడానికి అనుమతించబడతారని వెల్లడించింది.

పోల్ ప్రచారంపై నిషేధం.. సోషల్ మీడియాపైనా నిఘా

పోల్ ప్రచారంపై నిషేధం.. సోషల్ మీడియాపైనా నిఘా


ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత టెలివిజన్ ఛానెల్‌లు, రేడియో మరియు వార్తాపత్రికలలో ఎన్నికలకు సంబంధించిన విషయాలను ప్రసారం చేయడం పై నిషేధం విధించబడింది. పోల్‌కు 48 గంటల ముందు ఓటర్లను ప్రభావితం చేసే లేదా అభ్యర్థుల అవకాశాల గురించి లేదా రాజకీయ పార్టీ గురించి మాట్లాడే అంశాలు అనుమతించబడవని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఫిబ్రవరి 19 మరియు 20 తేదీలలో వార్తాపత్రికలలో ప్రచురించబడే ఏదైనా ప్రకటన కమిషన్ ద్వారా ముందస్తు ధృవీకరణ జరిగిన తరువాతనే ఇవ్వాలని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు గత 48 గంటలలో బల్క్ ఎస్ ఎం ఎస్ లు మరియు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS)తో సహా సోషల్ మీడియా ప్రకటనలపై నిషేధాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

1,000 పారామిలటరీ బృందాలు పంజాబ్ లో ఎన్నికల నిఘాలో ఉన్నాయి

1,000 పారామిలటరీ బృందాలు పంజాబ్ లో ఎన్నికల నిఘాలో ఉన్నాయి

1,000 పారామిలటరీ బృందాలు ఎన్నికల నిఘాలో ఉన్నాయని పేర్కొంది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఎమర్జెన్సీని ఎదుర్కోవడానికి బిఎస్ఎఫ్, సి ఆర్ పి ఎఫ్ మరియు ఐటీబీపీ సహా కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలతో కూడిన 1,000 క్విక్ రియాక్షన్ టీమ్‌లను (QRT) ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్రంలో కనీసం 700 కంపెనీలు నియమించబడ్డాయి, వాటిలో 650 వచ్చాయి మరియు మిగిలినవి గురువారం రాత్రికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నాయని ఏసీ వెల్లడించింది. పారామిలటరీ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్‌లను నిర్వహిస్తారు మరియు ఏరియా డామినేషన్ కోసం, రాష్ట్రవ్యాప్తంగా స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+