Punjab elections 2022:కాంగ్రెస్‌కు షాక్, హస్తానికి చేయిచ్చిన మాజీమంత్రి రానా, బీజేపీలో చేరిక

పంజాబ్ ఎన్నికలపై దాదాపు అన్నీ రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఎన్నికల్లో గెలవాలని తమ వ్యుహాలకు పదును పెట్టాయి. ఈలోపు పార్టీలు కూడా పుట్టుకు వస్తున్నాయి. ఇక చేరికలు కూడా జరుగుతున్నాయి. కీలక నేతలు ముందే తమ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు.

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సీనియ‌ర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, రాణా గుర్మీత్ సోధీ మంగ‌ళ‌వారం కాంగ్రెస్‌కు పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంత‌రం భారతీయ జ‌న‌తాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు కాగా.. అతని పార్టీలో చేరకపోవడం విశేషం. ఇవాళ ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో పంజాబ్ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ స‌మ‌క్షంలో ఆయ‌న బీజేపీలో చేరారు.

Punjab ex-minister Rana Gurmeet Sodhi joins BJP

రాణా గుర్మీత్ సోధీకి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర‌సింగ్ యాద‌వ్‌, సోంప్ర‌కాష్‌, బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దుష్యంత్ గౌత‌మ్ పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రం స‌రిహ‌ద్దు రాష్ట్ర‌మ‌ని, ఇక్క‌డ మ‌త సామ‌ర‌స్యాన్ని నెల‌కొల్ప‌డం అవ‌స‌మ‌ని, ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ విష‌యంలో విఫ‌ల‌మైంద‌ని అందుకే తాను బీజేపీలో చేరాన‌ని గుర్మీత్ సోధీ చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌ధాని మోడీ లాంటి వ్య‌క్తి మాత్ర‌మే పంజాబ్‌ను కాపాడ‌గ‌ల‌రని ఆయ‌న కామంట్ చేశారు.

అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేస్తామని మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల స‌ర్దుబాటును చేప‌డ‌తాయ‌ని అమరీందర్ ట్వీట్ చేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 101 శాతం తాము విజ‌యం సాధిస్తామ‌ని కెప్టెన్ సింగ్ ధీమా వ్య‌క్తం చేశారు. సీట్ల పంపిణీ ఇంకా జరగలేదని.. అయినప్పటికీ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం పక్కా అని షెకావత్ తెలిపారు. సీట్ల పంపకం అనేది విజయాన్ని బట్టి ఉంటుందని అమరీందర్ సింగ్ తెలియజేశారు. తమ కూటమి విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+