పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో రెట్టింపు వేతనం పడింది, కానీ అంతలోనే!

అమృత్‌సర్: సాంకేతిక సమస్య కారణంగా పంజాబ్ రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు తమకు వచ్చే వేతనానికి రెండింతలు పడింది. సమస్యను గుర్తించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. రెండింతల వేతనం పడటంతో దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం అదనంగా వేసి ఉంటుందని అందరూ భావించారు.

కానీ అది సాంకేతిక సమస్య అని గుర్తించి అంతలోనే నీరుగారిపోయారు. కంప్యూటర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఉద్యోగులకు రెట్టింపు వేతనం పడిందని ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పారు. అమృత్‌సర్‌తో పాటు పంజాబ్‌లోని పలు ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనం పడింది. తమ వేతనం కంటె రెండింతలు పడటంతో వారు షాకయ్యారు.

Punjab government employees receive double salary due to technical glitch, have to return

ఉద్యోగులు కేవలం ఒక నెల వేతనాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉద్యోగులకు రెట్టింపు వేతనం పడిన కారణంగా కేవలం అమృత్‌సర్ జిల్లాలోనే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఎక్కువ డబ్బు పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+