తలక్రిందులుగా వేలాడదీసి కొట్టి చంపారు (వీడియో)
అమృత్‌సర్: దొంగతనం కారణంతో ఓ వలస కూలీని యజమాని తలక్రిందులుగా వేలాడదీసి అత్యంత దారుణంగా హతమార్చిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, పంజాబ్‌లోని అమృత్ సర్ పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న కారణంతో బీహార్‌కు చెందిన వలస కూలీ రామ్ సింగ్‌ను గురువారం ఉదయం ఫ్యాక్టర యజమాని జస్ప్రీత్ సింగ్ కిడ్నాప్ అతడిని తలక్రిందులుగా వేలాడదీసి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు.

ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్కక్తి మొబైల్‌లో చిత్రీకరించాడు. 34 నిమిషాల నిడివిగల వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో కలకలం సృష్టిస్తోంది. సంఘటన జరిగిన మరుసటి రోజే రాంసింగ్ మృతదేహం లభించింది. ఈ దారుణానికి సహకరించిన మరో ఇద్దరిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications