మతం ముసుగులో అత్యాచారం.. ప్రముఖ పాస్టర్ కు యావజ్జీవ శిక్ష
ప్రముఖ మత ప్రబోధకుడు బాజిందర్ సింగ్ కు యావజ్జీవ శిక్ష పడింది. పంజాబ్ లోని మోహాలీ కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. పంజాబ్ కు చెందిన ప్రముఖ పాస్టర్ బాజిందర్ సింగ్ పై 2018లో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే మోహాలీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
మతం ముసుగులో మత ప్రబోధకుడిగా ప్రచారం చేసుకునే వ్యక్తి తనపై నమ్మకం పెట్టుకున్నభక్తులపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టకూడదని న్యాయమూర్తి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన అభ్యర్థించిన క్షమాభిక్షను కోర్టు కొట్టివేసింది. నమ్మిన భక్తులను వంచించడం ఏంటని ప్రశ్నించింది.

"అతను ఓ ప్రముఖ మత ప్రబోధకుడు. ఆయన్ను అందరూ పపాజీ అని పిలుస్తారు. అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి పనులకు పాల్పడితే కఠినంగా శిక్షించాల్సిన అవసరం కోర్టులపై ఉంది. బాజిందర్ సింగ్ కు యావజ్జీవ కారాగారం విధించడం సంతృప్తినిచ్చింది. అతడు జీవితకాలం మొత్తం జైల్లోనే ఉంటాడు" అని మోహాలీ హైకోర్టు న్యాయవాది అనిల్ సాగర్ తెలిపారు. బాజిందర్ సింగ్ పై సెక్షన్ 376(రేప్), 323(బాధించడం),506(చంపేందుకు కుట్ర) పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పాటియాలా జైలుకు తరలించారు.
2018లో రంజీత్ కౌర్ అనే మహిళ జీరక్ పుర్ పోలీస్ స్టేషన్ లో బాజిందర్ సింగ్ పై ఫిర్యాదు చేసింది. బాజిందర్ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. విదేశాలకు పంపిస్తానని మాయమాటలు చెప్పి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.












Click it and Unblock the Notifications