దీప్ సిద్దూ మృతి.. కబళించిన రోడ్డు ప్రమాదం.. ఎర్రకోటపై ఘటనతో హల్‌చల్
పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్దూ చనిపోయాడు. హర్యానాలో గల సోనిపట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆయన చనిపోయారు. అతని తెల్ల కలర్ స్కార్పియో వాహనం.. స్టేషనరీ తీసుకొస్తున్న ట్రక్కును ఢీ కొంది. హర్యానాలో గల ఖర్కొడా వద్ద ఫెరిపెరల్ ఎక్స్ ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. అతనితోపాటు నటి, స్నేహితురాలు రీనా రాయ్ కూడా ఉన్నారు. ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. దీప్ సిద్దూ చనిపోగా.. రీనా రాయ్‌కు చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద ఘటనపై పంజాబ్ సీఎం చన్నీ స్పందించారు. సిద్దూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అతని కుటుంబం, అభిమానులకు ధైర్యం కలుగజేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడే చోట సిక్కు జెండా ఎగురేయడమే కాదు సెక్యూరిటీ పోర్స్ పై దాడికి పురికొల్పడం వెనుక ఉన్నది కూడా దీప్ సిద్దూ అని తెలిసింది. ఎర్రకోట వద్ద ఓ ఫ్లాగ్ పోల్ పై పతాకాన్ని తానే ఎగురవేశానని దీప్ సిద్దు అంగీకరించాడు. ఈ స్తంభంపై 'నిషాన్ సాహిబ్' పతాకాన్ని తను ఎగురవేశానని, కానీ జాతీయ పతాకాన్ని మాత్రం తొలగించలేదని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు చిహ్నమని అన్నాడు. దేశ సమగ్రత, సమైక్యతలను ఎవరూ ప్రశ్నించలేరన్నాడు. ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నది వాస్తవమేనని పేర్కొన్నాడు. దీంతో సిద్దూపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రకోటపై తమ జెండాను ఎగురవేసిన తరువాత ఫేస్ బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చిన సిద్ధూ... ఆ దృశ్యాలను చూపిస్తూ, రైతులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు.
పంజాబ్ లోని ముక్తసర్ లోని సిక్కు కుటుంబంలో ఏప్రిల్ 2, 1984లో సిక్కు కుటుంబంలో దీప్ సిద్దు జన్మించాడు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాధమిక విద్యను అభ్యసించాడు. పటియాలలోని పంజాబ్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా సాధించి.. మోడల్, గాయకుడు, నటుడు, లాయర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 2018లో జోరాదాస్ నంబ్రియా సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుంచి అటు తెరపైనే కాకుండా.. నిజజీవితంలో కూడా గ్యాంగ్‌స్టర్ మాదిరిగానే సిద్దూ ఉంటున్నాడు.












Click it and Unblock the Notifications