వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆప్' , 'ఆకాలీదళ్ ల మద్య మాటల మంటలు', 'ఆప్ దాడుల వీడియో మా వద్ద ఉంది'

పంజాబ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆప్, అకాలీదళ్ పార్టీల మద్య మాటల యుద్దం సాగుతోంది. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమృత్ సర్ :పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్న వేళ ఆప్ , అకాళీదళ్ పార్టీల మద్య మాటల యుద్దం సాగుతోంది. ఈ రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరోకరు ఆరోపణలు గుప్పించుకొంటున్నారు.ఆప్ చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆకాళీదళ్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.మరో వైపు లాంబీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు.

పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ఆప్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పంజాబ్ లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఆప్ కు చెందిన పలువురు పార్టీ నాయకులు కూడ పంజాబ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఆప్ నాయకులు చేస్తోన్న ప్రచారంతో ఆ పార్టీ నాయకులు ఇబ్బందుల్లో పడ్డారు.అయితే ఆప్ చేస్తోన్న విమర్శలను ఇప్పడిప్పుడే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అకాళీదళ్ నాయకులు.

అకాలీదళ్ నాయకులపై,సభలపై కొందరు దాడులు జరుగుతున్నాయి.అయితే ఈ దాడుల తర్వాత ఆప్ పై విమర్శలను మరింత ఎక్కువ చేసింది అకాళీదల్ పార్టీ.ఈ నేపథ్యంలో రెండు పార్టీల మద్య మాటల యుద్దం సాగుతోంది.

 ఆకాలీదళ్, ఆప్ ల మద్య మాటల యుద్దం

ఆకాలీదళ్, ఆప్ ల మద్య మాటల యుద్దం

పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున ఆప్, అకాలీదళ్ పార్టీల మద్య మాటల యుద్దం సాగుతోంది. అధికారంలో ఉన్న అకాలీదల్ కు చెందిన మంత్రులు, ఆ పార్టీకి చెందిన నాయకులపై వచ్చిన ఆరోపణలను ఆసరాగా చేసుకొని ఆప్ విమర్శల స్వరాన్ని మరింత పెంచింది. అంతేకాదు తమ పార్టీ నిర్వహిస్తోన్న సభలపై ఆప్ దాడులకు పాల్పడుతోందని అకాళీదళ్ చెబుతోంది. ఈ మేరకు ఓ వీడియో తమ వద్ద ఉందని ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ప్రకటించాడు.

నామినేషన్ దాఖలు చేసిన ప్రకాష్ సింగ్ బాదల్

నామినేషన్ దాఖలు చేసిన ప్రకాష్ సింగ్ బాదల్

నామినేషన్ దాఖలు చేసిన ప్రకాష్ సింగ్ బాదల్
పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ గురువారం నాడు తన నామినేషన్ ను దాఖలు చేశాడు. గురువారంనాడు లాంబీ నియోజకవర్గం నుండి ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశాడు. తమ పార్టీ ఎన్నికలకు సిద్దంగా ఉందని చెప్పారు. తమ పార్టీకి ఏళ్ళ తరబడి ఓట్లు వేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.పంజాబ్ లో ఫిబ్రవరి నాలుగో తేదిన ఎన్నికలు జరుగుతాయి. గురువారం నుండి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 18వ, తేది వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేది.

 అల్లర్లకు ఆప్ ప్రయత్నం

అల్లర్లకు ఆప్ ప్రయత్నం

పంజాబ్ ప్రజలు శాంతికాములని ఎలాంటి గొడవలను ప్రజలు ఇష్టపడని , ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ చెప్పాడు. శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృస్టించేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని సిఎం ప్రకాష్ సింగ్ బాదల్ చెప్పారు. గతంలో ఏనాడు పంజాబ్ లో ఈ తరహ ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన చెప్పారు. ఇతర పార్టీల నాయకులపై ఆప్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.

 పంజాబ్ పై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న ఆప్

పంజాబ్ పై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న ఆప్

పంజాబ్ రాష్ట్రంలో 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది. దరిమిలా అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కేంద్రీకరించి పనిచేస్తోంది. తమ పార్టీకి చెందిన ముఖ్యనాయకులందరినీ పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తోంది ఆప్.ప్రకాష్ సింగ్ బాదల్ మంత్రివర్గంలో ఉన్న బిక్రమ్ సింగ్ మజితియాపై డ్రగ్ మాఫియాకు సహకరిస్తాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. అతణ్ని తాను జైల్లో పడేస్తానని ఆయన చెప్పారు.

English summary
punjub chiefminister filed nomination from lambi assembly segment.aaap special concetretate in punjub state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X