పాకిస్థాన్ నెత్తిన మరో పిడుగు ..భారత్‌కు మద్దతుగా రంగంలోకి ముస్లిం దేశం

ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు.

వీరిలో ఎక్కువ మంది భారతీయులే. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఉగ్రదాడి తర్వాత పహల్గామ్‌‌‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కు అండగా నిలుస్తున్నాయి.

Qatar President support India in the wake of terror attacks

తాజాగా ఖతార్ అధ్యక్షుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఉగ్రదాడి ఘటనలో భారత్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖతార్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవాళికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో భారత్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఖతార్ అధ్యక్షుడి ఈ చర్య కేవలం ఒక ప్రకటనగా మాత్రమే పరిమితం కాలేదు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి ఖతార్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం మరియు ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాలను అడ్డుకోవడం వంటి చర్యల్లో సహకరించడానికి ఖతార్ ముందుకొచ్చింది.

ఖతార్ అధ్యక్షుడి మద్దతుకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఖతార్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తోంది.

ఉగ్రవాదం ప్రపంచానికి ఒక పెను సవాలుగా మారిన ఈ సమయంలో, ఖతార్ వంటి దేశాలు భారత్‌కు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇది ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ఖతార్ చూపిన సంఘీభావం రెండు దేశాల మధ్య స్నేహబంధాన్ని మరింత బలపర్చినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+