నేను తప్పు చేశా: రాజీనామాపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: తాను ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి అనవసరంగా తప్పుకున్నానని నారాయణ మూర్తి చాలా బాధపడిపోతున్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన 2014లో చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.

దాని నుంచి తప్పుకున్నందుకు ఇప్పుడు ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు. సహ వ్యవస్థాపకుల మాట విని తాను పదవిలో కొనసాగి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. కంపెనీ వీడొద్దని సహచరులు చెప్పారని తెలిపారు.

వ్యక్తి గతంగా, వృత్తి గతంగా తాను పశ్చాత్తాప పడాల్సిన విషయం పదవి నుంచి తప్పుకునే విషయంలోనే అన్నారు. కాగా, ప్రస్తుత యాజమాన్యం పాటిస్తున్న కార్పొరేట్‌ పాలనా విధానాలపై ఆయన బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.

కొనసాగమని చెప్పారు కానీ

కొనసాగమని చెప్పారు కానీ

సహ వ్యవస్థాపక సహచరులు కంపెనీని వీడొద్దని 2014లో చెప్పారని, మరికొన్నేళ్లు కొనసాగాలని కోరారని, తనకు భావోద్వేగాలు ఎక్కువని గమనించానని, చాలా వరకు తన నిర్ణయాలు ఆదర్శభావాల అనుసారంగా తీసుకుంటానని నారాయణ మూర్తి చెప్పారు.

Nandan Nilekani Co-Founder of Infosys Exclusive Interview on Oneindia
వారి మాట వినాల్సింది

వారి మాట వినాల్సింది

తాను వారి మాట విని ఉందని మూర్తి చెప్పారు. అయితే ఇన్ఫోసిస్‌ ప్రాంగణంలో అడుగు పెట్టకుండా ఎపుడూ ఉండలేదని తెలిపారు. కాగా, ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్‌ను ఏర్పాటు చేసిన 33 ఏళ్ల అనంతరం అంటే 2014లో మూర్తి సంస్థను వీడారు.

అంతకుముందు..

అంతకుముందు..

నందన్‌ నీలేకనికి పగ్గాలు ఇవ్వడానికి ముందు సుదీర్ఘకాలం అంటే ఇరవై ఒక్క ఏళ్లు సీఈఓగా మూర్తి కొనసాగారు. నీలేకని తర్వాత క్రిస్‌ గోపాలకృష్ణన్‌, ఎస్‌డి శిబూలాల్‌లు వరుసగా సీఈఓగా పగ్గాలు చేపట్టారు.

ప్రస్తుత విశాల్ సిక్కా

ప్రస్తుత విశాల్ సిక్కా

2014 అక్టోబరులో ఆ పదవిలోకి వచ్చిన విశాల్‌ సిక్కా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గత కొద్ది నెలలుగా కార్పొరేట్‌ పాలన, సీఈఓ వేతన ప్యాకేజీ, మాజీ ఉద్యోగులకు భారీ చెల్లింపులపై నారాయణ మూర్తి తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Infosys founder NR Narayana Murthy said his biggest regret was quitting as chairman of Infosys in 2014, even as he has been involved in an acrimonious battle with the company’s board and management.
Please Wait while comments are loading...