నడిరోడ్డు మీద రూ.14.50 లక్షలు లూటీ
బెంగళూరు: నడి రోడ్డు మీద బైక్ తో డీకొని నగదు ఉన్న బ్యాగ్ తో సహ దుండగులు పరారైన సంఘటన బెంగళూరులో జరిగింది. ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్ అనే బాధితుడు బెంగళూరులోని హుళిమావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీనగరలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పని చేస్తున్న కంపెనీకి బెంగళూరులోనే అనేక శాఖలు ఉన్నాయి. ప్రతి రోజూ పని చేస్తున్న కంపెనీకి సంబంధించిన నగదును ఇతను బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటాడు. జేపీ నగరలోని బ్రాంచ్ లో, బన్నేరుఘట్ట రోడ్డులోని బ్రాంచ్ లో రూ. 14.50 లక్షలు తీసుకున్నాడు.

తరువాత నగదు బ్యాగ్ లో పెట్టుకుని రిచ్చర్డ్ సర్కిల్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో డిపాజిట్ చెయ్యడానికి బైక్‌పై బయలుదేరాడు. నగదు ఉన్న బ్యాగ్ బైక్ పెట్రోల్ ట్యాంకు మీద పెట్టాడు. మార్గం మద్యలో ఓంకార నగరలోని రెండవ మెయిన్ రోడ్డులో వెళుతున్న సమయంలో వెనుక నుండి బైక్‌పై వెళ్తూ ఇద్దరు దుండగులు రాజశేఖర్ బైక్ ను డీకొట్టారు.
ఆ సందర్బంలో రాజశేఖర్ బైక్ తో పాటు కింద పడిపోయాడు. నగదు బ్యాగు కిందపడింది. దుండగులు రాజశేఖర్ మీద దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్ ఎత్తుకుని వచ్చిన బైక్‌పైనే పరారైనారు. బాధితుడు రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ బ్యాంకు దగ్గరకు నగదు తీసుకు వెళుతున్నాడనే విషయం తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications