తప్పుకున్న కామత్: ఇన్ఫోసిస్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన శేషసాయి
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఛైర్మన్ బాధ్యతల నుంచి కెవి కామత్ తప్పుకున్నారు. ఆ వెంటనే ప్రస్తుతం కంపెనీ బోర్డ్ సభ్యుడిగా ఉన్న ఆర్ శేషసాయి తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) బ్యాంకు తొలి ఛైర్మన్‌గా కెవి కామత్ ఎంపికైన నేపథ్యంలోనే ఆయన ఇన్ఫోసిస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన బ్రిక్స్‌కు వెళ్లడానికి ముందే శేషసాయి ఎంపిక పూర్తవుతుందని ముందుగానే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శేషసాయి ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. శేషసాయి ఇన్ఫోసిస్‌కు రాక పూర్వం అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. గడిచిన నాలుగేళ్లుగా ఆయన ఇన్ఫోసిస్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్ష బాధ్యతలను కెవి కామత్ జులై మొదటి వారంలో చేపట్టనున్నారు. వచ్చే వారంలో చైనాలో పర్యటించనున్న కామత్, జులై ప్రారంభంలో అధికారికంగా బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు.












Click it and Unblock the Notifications