రన్ వేపై కుందేళ్లు: రెండు విమానాలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
అహ్మదాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమదం తృటిలో తప్పింది. రన్‌వేపై ఉన్న కుందేళ్ల కారణంగా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింద
అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమదం తృటిలో తప్పింది.
రన్‌వేపై ఉన్న కుందేళ్ల కారణంగా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి 142మంది ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం, బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో విమానం శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.
ఇండిగో విమానం ల్యాండ్ అయిన రన్‌వే క్లియర్ అయిన తర్వాత అదే రన్‌వేపై నుంచి స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇండిగో విమానం పూర్తిగా వెళ్లకముందే స్పైస్‌జెట్‌కు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది.

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమాన పైలట్‌ను రన్‌వే బ్యాక్‌ట్రాక్‌పైకి రావొచ్చని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలిపింది. ఈలోగా ఇండిగో విమానం రన్‌వే నుంచి వెళ్లిపోవాల్సి ఉండగా మధ్యలో కుందేళ్లు ఉండడంతో రన్‌వే ఎగ్జిట్ ట్యాక్సీ ట్రాక్‌పై ఆగింది. ఇది గమినించిన ఏటీసీ వెంటనే స్పైస్‌జెట్ విమానాన్ని ఆగిపోవాల్సిందిగా సూచించింది.
తక్షణమే ఆగిపోవాలని రెండు సార్లు హెచ్చరించడంతో స్పైస్‌జెట్ పైలట్ టేకాఫ్‌ను నిలిపేసి విమానాన్ని ఆపేశారు. కొద్ది నిమిషాల్లో టేకాఫ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఏటీసీ టేకాఫ్‌ను నిలిపేసింది. ఏటీసీ అధికారులు, పైలెట్లు వెంట వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications