కాశ్మీర్: పాక్ జెండా ఎగరేసిన రాడికల్ మహిళలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ భూభాగంలో వేర్పాటువాదుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేర్పాటువాద మహిళాసంస్థ దుఖ్‌తరన్-ఎ-మిలత్(డిఇఎం) సభ్యులు శుక్రవారం పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు.
శ్రీనగర్ శివార్లలోని బచ్‍పొరా ప్రాంతంలో పాకిస్థాన్ జాతీయ జండా ఎగరేసి, ఆ దేశ జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ సంస్థ నాయకురాలు ఆసియా అంద్రాబీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమైన 1990వ దశకం నుంచి హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి సంస్థలు పాక్ స్వాతంత్ర్యదినాన్ని పురస్కరించుకుని పూర్తిస్థాయి పరేడ్‌లను సైతం నిర్వహిస్తుండేవి.
ఈ పరిస్థితులకు తోడు అక్కడ ఐఎస్ ఉగ్రవాద సంస్థల జెండాలు కూడా ఇటీవల రెపరెపలాడుతూ దేశ భద్రతా సంస్థలకు సవాల్‌గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications