వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరప్రదేశ్ లో ముస్లీం నాయకుడిపై కాల్పులు: కోమాలో బీజేపీ నాయకుడు, నడిరోడ్డులో !

ఉత్తరప్రదేశ్ లో పాతకక్షలు భగ్గుమన్నాయి. బీజేపీకి చెందిన మైనారిటీ విభాగం నాయకుడిపై నడిరోడ్డులో రివాల్వర్ తో కాల్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ లో పాతకక్షలు భగ్గుమన్నాయి. బీజేపీకి చెందిన మైనారిటీ విభాగం నాయకుడిపై నడిరోడ్డులో రివాల్వర్ తో కాల్చి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన బాధితుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.

బరేలీ జిల్లా బీజేపీ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు రయీస్ అహమ్మద్ పై హత్యాయత్నం జరిగిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి పనిపై వెలుతున్న రయీస్ అహమ్మద్ ను దేవ్ చార ప్రాంతంలో ప్రత్యర్థులు అడ్డుకున్నారు.

Raees Ahmed, the vice-president of BJP’s Bareilly region minority wing was shot at by unidentified persons

తరువాత రయీస్ అహమ్మద్ మీద మూడు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనారు. తీవ్రగాయాలైన రయీస్ అహమ్మద్ ను ఆసుపత్రికి తరలించారు. రయీస్ అహమ్మద్ పరిస్థితి విషమంగా ఉందని, అతను ఐసీయూలో కోమాలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.

అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన మైనారిటీ విభాగం నాయకుడిపై హత్యాయత్నం జరగడంతో సొంత పార్టీ నేతలు హడలిపోయారు. ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న సీఎం యోగీ ఆదిత్యానాథ్ సొంత పార్టీ నేతలకే రక్షణ కల్పించలేకపోతున్నారని, ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని, వెంటనే ఆయన రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Raees Ahmed, the vice-president of BJP’s Bareilly region minority wing was shot at by unidentified persons on Thursday. Ahmed who was shot at thrice has been admitted to hospital in a critical condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X