Ragging:ప్రైవేట్ పార్ట్స్ పై డంబెల్స్-ర్యాగింగ్ పేరుతో సీనియర్ల ఆకృత్యాలు..!!

ప్రభుత్వాలు ర్యాగింగ్ భూతాన్ని అణిచివేసేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. దేశంలో ఏదో ఒక మూలాన విద్యార్థులు ర్యాగింగ్‌కు గురవుతున్నారు. ర్యాగింగ్ అనే ఈ పెనుభూతం కారణంగా ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. తాజాగా కేరళలోని కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పెనుభూతం కోరలు చాచింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్ పేరుతో జూనియర్లను చిత్రహింసలకు గురిచేశారు సీనియర్లు.

కేరళ రాష్ట్రం కొట్టాయంలోని నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు నెలలుగా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నట్లు వెలుగు చూసింది. అయితే ఇది పరాకాష్టకు చేరడంతో విసిగి పోయిన జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

Ragging in Kottayam nursing college-Seniors hang dumbells to Junior students private parts

మర్మాంగం పై డంబెల్స్‌తో..

కొట్టాయం నర్సింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం విద్యార్థులు సామ్యూట్ జాన్సన్ (20)జీవా (19), థర్డ్ ఇయర్ విద్యార్థులు రాహుల్ రాజ్ (22),రిలిజిత్ (21),వివేక్ (21)లు ఫస్టియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. ముందుగా ఫస్టియర్ విద్యార్థులను నగ్నంగా నిలబెట్టి వారి ప్రైవేట్ పార్ట్స్ పై డంబెల్స్ ఉంచారు. అనంతరం కంపాస్‌తో ప్రైవేట్ పార్ట్స్ పై గుచ్చడంతో ఫస్టియర్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ మొత్తం ఘటనను వీడియో తీశారు.తమను వదిలేయమని ఎంత వేడుకున్న కనికరించలేదు. పైగా విషయాన్ని బయటకు చెబితే ఈ వీడియోలను బయట పెడతామని బెదిరించారు. మెన్స్ హాస్టల్‌లో ఈ ర్యాగింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

డబ్బులు దోచుకున్న సీనియర్లు

ఇక ఈ ఐదుగురు సీనియర్లు జూనియర్ల నుంచి రూ.800 డబ్బులు దోచుకున్నారు. మద్యం సేవించారు.అంతేకాదు మద్యం తీసుకోవాల్సిందిగా జూనియర్లను బలవంతపెట్టారు. ఇక విసిగి వేశారిపోయిన జూనియర్లు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.ఒక విద్యార్థి అడిగిన డబ్బులు ఇవ్వనందున అతన్ని ఈ సీనియర్లు చితకబాదినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసుకు మరింత బలం చేకూరింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్ ఈ ఐదుగురు సీనియర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.సీనియర్లంతా తిరువనంతపురంకు చెందినవారుగా గుర్తించడం జరిగింది.ర్యాగింగ్ నివారణ చట్టం 2011 కింద ఐదుగురిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+