• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాఫెల్ అంశంలో మోడీపై రాహుల్ నిప్పులు: చౌకీదారే దొంగయ్యాడన్న కాంగ్రెస్ అధ్యక్షుడు

|

దేశానికి వాచ్‌మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని అది మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్‌ కొనుగోలు విషయంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టిన విషయాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అదే సమయంలో ఆ పత్రిక చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టుపై రాహుల్ అభినందించారు. ఓవైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో రాఫెల్ కొనుగోలుపై చర్చలు జరుపుతుండగానే మరోవైపు ప్రధాని కార్యాలయం అడ్డదారిలో చర్చలు జరిపిందనే విషయాన్ని ఆ పత్రిక వెల్లడించింది. ఇంత పక్కాగా సమాచారం వచ్చాక కూడా కచ్చితంగా రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. అంతేకాదు ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తీర్పు ప్రశ్నార్థకంగా మారిందన్నారు రాహుల్ గాంధీ.

 Rahul attacks Modi over Rafel deal, says Chowkidaar has become a chor

అధికారికంగా భారత బృందం ఫ్రాన్స్‌తో చర్చలు జరుపుతుండగానే ప్రధాని మరొకరితో చర్చలు ఎందుకు జరిపాల్సి వచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. ఇది తనకోసమో లేక ప్రజలకోసమో కాదని తన స్నేహితుడు అనిల్ అంబానీ కోసమే ప్రధాని మోడీ చర్చలు జరిపారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీంతో చౌకీదార్ దొంగగా మారినట్లు స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ విమర్శించారు. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంపై రక్షణశాఖ ఎప్పుడో అడ్డు చెప్పిన విషయాన్ని తను పదేపదే చెబుతూ వచ్చినప్పటికీ ప్రభుత్వం తన ఆవేదనను పెడిచెవిన పెట్టిందని రాహుల్ గాంధీ చెప్పారు.

ఇదిలా ఉంటే గురువారం లోక్‌సభలో రాఫెల్ వివాదంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు రక్షణ వ్యవస్థ బలోపేతం కావడం ఇష్టం లేనట్లుందని చెప్పిన ప్రధాని అందుకే పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తోందని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్ రాఫెల్‌పై అంతగట్టిగా ఎలా అబద్దాలు చెప్పగలుగుతోందో తనకు ఇప్పటికీ అర్థంకాలేదని మోడీ చెప్పారు. తర్వాత తనకు అసలు సంగతి బోధపడిందన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పాలనలో ఒక్క రక్షణ ఒప్పందం కూడా సవ్యంగా జరగలేదని ఆరోపించిన ప్రధాని ఎన్డీఏ హయాంలో కూడా జరగకూడదనే కృతనిశ్ఛయంతో కాంగ్రెస్ పనిచేస్తోందని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress President Rahul Gandhi on Friday launched an attack against Prime Minister Narendra Modi over Rafale deal and accused the PMO of running "parallel negotiations" with the French side.Speaking to media, Rahul said,''PM Modi himself robbed Air Force's Rs 30,000 crore and gave it to Anil Ambani, we have been raising this since 1 year. Now a report has come where Defence Ministry officials say that PM was holding parallel negotiations with France Government.''
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more