ప్రతిపక్ష నేత మోడీ: రాహుల్ పొరపాటు, విమర్శలు
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని పొరపాటుగా ప్రతిపక్ష నేత అని సంబోధించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్న రాహుల్ గాంధీ.. బుధవారం మహారాష్ట్రలో ప్రసంగించారు. ఈ సందర్భంలోనే రాహుల్ పొరపాటున మోడీని ప్రతిపక్షనేత అని అన్నారు.
‘ప్రతిపక్ష నాయకుడు 60ఏళ్లలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. కేవలం ఒక్క వ్యక్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలడని ఆయన భావిస్తున్నారు' అని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజల శ్రమతోనే దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు.

భారత సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులకు తెగపడుతుంటే మోడీ సరైన రీతిలో స్పందించడం లేదని రాహుల్ విమర్శించారు. చైనా సైన్యం ఓ వైపు మన దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తుంటే చైనా అధ్యక్షుడితో మోడీ ఊయల ఊగడమేంటని ఆయన ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ 20 ర్యాలీలకు ప్రణాళిక వేసుకుని, గత నాలుగు రోజుల్లో 11 ర్యాలీలను పూర్తి చేశారు. కాగా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేవలం నాలుగు ర్యాలీలకే పరిమితమయ్యారు. అందులో రెండు బుధవారం పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications