Rahul Gandhi: హత్రాస్ ఘటనపై రాహుల్ గాంధీ సంతాపం..

యూపీలోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో 107 మంది చనిపోయారు. ఈ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. హత్రాస్ ఘటన చాలా బాధాకరమన్నారు. గాయపడినవారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. యూపీ ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరారు. బాధితులకు ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.

గాయపడిన, బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ కార్యకర్తలు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. మంగళవారం హత్రాస్ జిల్లాలోని రతీభాన్ పూర్ లో భోలేబాబా ప్రవచనాలు చెప్పేందుకు వచ్చారు. ప్రవచనాల తర్వాత మధ్యాహ్నం తొక్కిసలాట జరిగింది. దీంతో 100 మందికి పైగా మరణించారు. 150 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హత్రాస్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున సాయం ప్రకటించగా.. గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు వెల్లడించారు.

Rahul Gandhi condoles the Hathras stampede incident in Uttar Pradesh

ఘటన తర్వాత ఈ సత్సంగ్ నిర్వహించింది ఎవరు..? ఎందుకింత మంది భక్తుల తరలివచ్చారు అనేదాని పోలీసులు విచారణ చేస్తున్నారు.విశ్వహరి భోలే బాబా అసలు పేరు సౌరభ్ కుమార్. సౌరభ్ గతంలో ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ నిఘా విభాగంలో పనిచేశారు. 17 ఏళ్ల సర్వీస్ చేసిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత బోధకుడిగా ఆవతారమెత్తాడు. భోలే బాబా తెల్లటి సూట్, టైలో బోధనలు చేస్తుంటారు.

భార్యతో కలిసి సత్సంగ్ నిర్వహిస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం బాబా నిర్వహించిన సత్సంగ్ లో వేలాది మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్యం పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+