వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరద్ యాదవ్ వద్ద రాహుల్ మొహమాటం: వెంటనే అందుకున్న ఏచూరి

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను ఓ విషయంపై అడిగేందుకు మొహమాటపడ్డారట. దీంతో అక్కడేవున్న సీపీఎం నేత సీతారాం ఏచూరి కల్పించుకుని రాహుల్ అడగాల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను ఓ విషయంపై అడిగేందుకు మొహమాటపడ్డారట. దీంతో అక్కడేవున్న సీపీఎం నేత సీతారాం ఏచూరి కల్పించుకుని రాహుల్ అడగాలనుకున్నది అడిగేశారట.

శరద్ యాదవ్ సుదీర్ఘ ప్రసంగం

శరద్ యాదవ్ సుదీర్ఘ ప్రసంగం

అసలు విషయంలోకి వెళితే.. మంగళవారం ప్రతిపక్షాలు భేటీ అయిన సందర్భంలో రైతు సమస్యలపైన చర్చించారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లి మోడీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావించాయి. కాగా, ఈ సమావేశానికి హాజరైన శరద్ యాదవ్ రైతుల సమస్యలపై చాలా సేపు మాట్లాడారు.

రాహుల్ మొహమాటం

రాహుల్ మొహమాటం

దీంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలకు ఓ సందేహం వచ్చింది. శరద్ యాదవ్ పార్టీ తరపున ఈ విషయం చెప్పారా? లేక వ్యక్తిగతంగా చెప్పారా? అని తెలుసుకోవాలనుకున్నాయి. నేరుగా ఈ విషయాన్ని అడగాలనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ అడగలేకపోయారు.

Recommended Video

Akhilesh Yadav Lost UP, Social Trade Investors Contribution
సీతారాం ఏచూరి అడిగేశారు..

సీతారాం ఏచూరి అడిగేశారు..

ఈ నేపథ్యంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆ బాధ్యత తీసుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శరద్ యాదవ్‌ను అడిగేశారు. దీంతో రైతుల సమస్యలపై తమ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, తాను తన పార్టీ తరపునే మాట్లాడానని శరద్ యాదవ్ స్పష్టం చేశారు.

నితీష్ వ్యవహారం వల్లే..

నితీష్ వ్యవహారం వల్లే..

కాగా, గతంలో పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా శరద్ యాదవ్ మాట్లాడగా, అదే పార్టీకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం విభేధించినట్లు ఈ సందర్భంగా కొందరు గుర్తు చేశారు. అంతేగాక, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కూడా నితీష్ మద్దతు పలకడంతో ఆయన ఆ
కూటమికి దగ్గరవుతున్నారని రాహుల్ గాంధీ కూడా భావించినట్లున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్.. శరద్ యాదవ్‌ను ఈ ప్రశ్న అడగాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

English summary
When senior Janata Dal-United leader Sharad Yadav talked of raising the farmer unrest in the country to corner the Modi government at Tuesday's meeting of Opposition parties, many leaders present wanted to know whether Mr Yadav was speaking for himself or for his party, which is led by Bihar's Chief Minister Nitish Kumar, who has recently been seen to align more with the ruling BJP on key issues.1
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X