రోడ్డు పక్కన కారం కారంగా మిరపకాయ బజ్జీలు తిని టీ తాగిన రాహుల్ గాంధీ, రూ. 2 వేలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మూడు రోజుల నుంచి శాసన సభ ఎన్నికల ప్రచారం చేస్తూ బీజీగా ఉన్నారు. మూడో రోజు రాయచూరు జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఆ సందర్బంలో కొంచెం తీరిక చేసుకున్న రాహుల్ గాంధీ రోడ్డు పక్కన రేకుల షెడ్ లో నిర్వహిస్తున్న చిన్న హొటల్ లో కుర్చుని ఉత్తర కర్ణాటకలో ప్రసిద్ది చెందిన కారం కారంగా ఉన్న మిరపకాయ బజ్జీలు, గిర్మిట్ ఆరగించి టీ తాగి ఆ రుచికి ఫిదా అయిపోయారు.

 రోడ్ షోలో రాహుల్ గాంధీ

రోడ్ షోలో రాహుల్ గాంధీ

సోమవారం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఆ సందర్బంలోనే రాయచూరు జిల్లా కల్మాల గ్రామం మీదుగా రోడ్ షో జరిగింది. ఆ సమయంలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీకి రోడ్డు పక్కన రేకుల షెడ్ లో నిర్వహిస్తున్న ఓ చిన్న హోటల్ కనపడింది.

చిన్న టేబుల్

చిన్న టేబుల్

రేకుల షేడ్ లో నిర్వహిస్తున్న హోటల్ లోకి రాహుల్ గాంధీ వెళ్లారు. రాహుల్ గాంధీ తన వెంట సీఎం సిద్దరామయ్య, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్, కేంద్ర మాజీ మంత్రి వీరప్పమెయిలీ, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు వేణుగోపాల్ ను పిలుచుకుని వెళ్లారు.

ఇరుకైన టేబుల్ లో!

ఇరుకైన టేబుల్ లో!

రేకుల షేడ్ లో ఉన్న ఇరుకైన టేబుల్ లో రాహుల్ గాంధీ, సీఎం సిద్దరామయ్య, డాక్టర్ జీ. పరమేశ్వర్, వీరప్పమెయిలీ కుర్చున్నారు. ఎదురుగా ఉన్న టేబుల్ లో వేణుగోపాల్, మల్లికార్జున ఖార్గే, డీకే. శివకుమార్ తదితరులు కుర్చున్నారు.

మిరపకాయ బజ్జీలు

మిరపకాయ బజ్జీలు

ఉత్తర కర్ణాటకలో కారం కారంగా ఉండే మిరపకాయ బజ్జీలు, గుర్మిట్ తినడం అక్కడి ప్రజలకు అలవాటు. మిరపకాయ బజ్జీలు, గుర్మిట్, టీలకు ఉత్తర కర్ణాటక ప్రజలు ఎంతో ప్రధాన్యం ఇస్తారు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ హోటల్ లో చేస్తున్న మిరపకాయ బజ్జీలు తెప్పించారు.

పంచిపెట్టిన రాహుల్

పంచిపెట్టిన రాహుల్

న్యూస్ పేపర్లో మిరపకాయ బజ్జీలు, గుర్మిట్ తీసుకు వచ్చి టేబుల మీద పెట్టారు. కారం కారంగా ఉన్న కొన్ని మిరపకాయ బజ్జీలు ఆరగించిన రాహుల్ గాంధీ తరువాత సీఎం సిద్దుతో సహ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ మిపరపకాయ బజ్జీలు పంపిపెట్టారు.

మీడియాకు బజ్జీలు

మీడియాకు బజ్జీలు

మిరపకాయ బజ్జీలు తింటూ అక్కడ ఉన్న మీడియా ప్రతనిధులకు రాహుల్ గాంధీ స్వయంగా బజ్జీలు పంపింపెట్టారు. అనంతరం రాహుల్ గాంధీ తరువాత వేడివేడి టీతాగారు. రాహుల్ గాంధీతో పాటు అక్కడ నాయకులు చిన్నహోటల్ లో తయారుచేసిన టీ తాగారు.

బజ్జీలకు రూ. 2 వేలు

బజ్జీలకు రూ. 2 వేలు

హోటల్ యజమానురాలిని పిలిచిన రాహుల్ గాంధీ రోజుకు ఎంత వ్యాపారం జరుగుతుంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు రూ. 2 వేలు ఇచ్చిన రాహుల్ గాంధీ మిరపకాయ బజ్జీలు, గుర్మిట్, టీ చాల రుచిగా ఉన్నాయని చెప్పి నమస్కారం పెట్టి రోడ్ లో బిజీ అయిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AICC president Rahul Gandhi eats North Karnataka's Famous food item Mirchi Bajji and Girmit in Raichur district Kalmala village.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి