వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాపై రాహుల్ ఫైర్: లేడీ కార్పోరేటర్‌ను తన్నిన ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

ఫరీదాబాద్/ డామన్: హర్యానా ఫరీదాబాద్‌లో దళిత చిన్నారులను సజీవదహనం చేసిన ఘటనలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహనం కోల్పోయారు. బాధితులతో ఫొటోలు దిగేందుకు వచ్చారా అని మీడియా ప్రతినిధులు అడగడంపై తీవ్రంగా మండిపడ్డారు. అలా అడగడం తనను అవమానించడమేనన్నారు.

మీడియా ప్రతినిధుల ప్రశ్న బాధితులను అవమానించే విధంగా అన్నారు. మళ్ళీ మళ్లీ వస్తానని ఆవేశంగా చెప్పారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేస్తూ నేతలు ఫరీదాబాద్‌కు పోటెత్తడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ సహనాన్ని కోల్పోయారు. ఫరీదాబాద్ ఘటన దురదృష్టకరమైందన్న బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ దళితులపై అనేక దాడులు జరిగాయని, ఆ విషయాన్ని ఆయన మరచినట్లే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Rahul gandhi expresses anguish at media

గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే నవీన్ పటేల్ ఓ మహిళా కార్పొరేటర్‌పై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెను తొలుత బలంగా తోసి కింద పడేశాడు. ఆ తర్వాత ఆమె లేచి అతడిని కాలితో తన్నబోయింది. తప్పించుకున్న ఎమ్మెల్యే తిరిగి ఆమెను కాలుతో కడుపులో తన్నాడు.

డామన్‌లో బిజెపి చింతన్ శిబిర్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఆరోపణలు చేసినందుకే ఆమెపై దాడి చేశాడని తెలిసింది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ఆమెను కాపాడారు. దీనిపై బిజెపి అధిష్టానం ఎమ్మెల్యేకు నోటీసులిచ్చింది. సదరు మహిళా కార్పొరేటర్ ఎమ్మెల్యే నవీన్ పటేల్‌పై కేసు పెట్టింది.

English summary
Congress vice president Rahul gandhi expressed anguish at media in Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X