Rahul Gandhi: రాయ్ బరేలీలో రాహుల్ నామినేషన్- భయపడొద్దు, పారిపోవద్దన్న మోడీ..!
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కూడా అదే స్ధాయిలో ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా యూపీలోని అమేథీని వదిలి తన తల్లి సోనియాగాంధీ ఈసారి వదిలేసిన రాయ్ బరేలీ స్ధానంలో పోటీ చేయాలని రాహుల్ గాందీ నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ సోనియా, ప్రియాంకతో కలిసి వెళ్లి రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో ఇప్పటివరకూ కాంగ్రెస్ కంచుకోటలు అమేథీ, రాయ్ బరేలీపై ఆ పార్టీలో నెలకున్న గందరగోళంపై బీజేపీ చేస్తున్న విమర్శలకు చెక్ పడినట్లయింది. అయితే గతంలో మూడుసార్లు గెలిచిన అమేథీ స్ధానాన్ని గతంలో ఓడిపోయారన్న కారణంతో ఈసారి వదిలేసుకున్న రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలకు దిగుతోంది. రాహుల్ అమేథీ స్ధానంలో పోటీకి భయపడి పారిపోయారని ప్రధాని మోడీ ఆరోపించారు.

మరోవైపు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరు తెచ్చుకున్న అమేథీ, రాయ్ బరేలీ సీట్లపై ఈసారి ఆ పార్టీలో గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోవడం, గతంలో పలుమార్లు రాయ్ బరేలీ నుంచి గెలిచిన సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఈ గాంధీ కుటుంబ కంచుకోటలపై సస్పెన్స్ పెరిగింది. అయితే రాయ్ బరేలీలో ప్రియాంక, అమేథీలో తిరిగి రాహుల్ పోటీ చేస్తారని తొలుత భావించారు.
ఓ దశలో అమేథీలో రాబర్ట్ వాద్రా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కనిపించింది. అయితే ప్రియాంక మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న కుటుంబ పార్టీ విమర్శల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమేథీ సీటును పార్టీ విథేయుడు కేఎల్ శర్మకు ఇచ్చేశారు. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. ఇది కూడా ఓ రకంగా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications