మరో యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ.. ముహూర్తం ఫిక్స్, అక్కడి నుంచే స్టార్ట్ !
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రజా యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన భారత్ జోడో పేరుతో రెండు భారీ యాత్రలు నిర్వహించి దేశం చుట్టివచ్చారు. తాజాగా ఆయన బీహార్‌లో 16 రోజులపాటు 'ఓటర్ అధికార్ యాత్ర' చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ఈ యాత్ర ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లా ససారాం నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 1న పాట్నాలో మహాసభతో ముగియనుంది. ఈ ప్రయాణంలో రాహుల్ మొత్తం 1300 కిలోమీటర్ల దూరం కవర్ చేసి, రాష్ట్రంలోని 24 జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ పాదయాత్రలో బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో పాటు ఇండియా కూటమిలోని సీనియర్ నాయకులు, వామపక్ష పార్టీలు, ఇతర మిత్రపక్ష నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. యాత్రకు సంబంధించిన అన్ని అనుమతులు, సన్నాహాలు పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 1న పాట్నా గాంధీ మైదానంలో జరిగే మహాసభతో ఈ యాత్ర ఘనంగా ముగుస్తుందని వివరించారు.
ఓటర్ల జాబితా నుంచి తొలగింపుపై ఆందోళన..
కాగా బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలు, కూలీలు వంటి లక్షలాది మంది ఓటర్లను బీజేపీ కుట్ర పన్నుతూ జాబితా నుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఓటు హక్కును హరిస్తే రేపు ఉచిత ఆహారం, ఇళ్లు వంటి ప్రభుత్వ పథకాల లబ్ధులను కూడా నిరాకరిస్తారని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ కుట్రను బీహార్ ప్రజలకు అర్థం చేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపడుతున్నారని కాంగ్రెస్ చెబుతోంది.
ప్రజాస్వామ్య రక్షణ యుద్ధం
రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేస్తూ - ''ఈ యాత్ర కేవలం ఎన్నికల సమస్య మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఒక నిర్ణయాత్మక యుద్ధం. 'ఒక వ్యక్తి, ఒక ఓటు' అనే సూత్రాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం'' అని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి బీహార్ యువత అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమీ పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీహార్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాదయాత్ర చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications