బీజేపీలో చేరకపోతే అంతే..: మోడీపై రాహుల్ సంచలన ఆరోపణలు

ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆదివారం ముంబైలో జరిగిన భారత్​ జోడో న్యాయ్​ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈవీఎమ్‌​లు, ఈడీ, సీబీఐ లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో గెలవలేరని రాహుల్ ఆరోపించారు.
మోడీ శక్తి కోసం ఒక ముసుగు అని అన్నారు.

మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి ఏడ్చాడని.. ఈ శక్తితో తాను పోరాడలేనని, అలా చేసి జైలుకు వెల్లడం ఇష్టం లేదని బాధపడ్డాడని రాహుల్​ చెప్పుకొచ్చారు. మోడీ 56 అంగుళాల ఛాతీ లేని నిస్సార మనిషి అని విమర్శించారు. నరేంద్ర మోడీకి అవినీతిపై గుత్తాధిపత్యం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. సమాజంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ద్వేషాన్ని ఎత్తిచూపడానికి తాను భారత్​ జోడో యాత్రలను ప్రారంభించాల్సి వచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు.

rahul gandhi hits out at pm modi in india alliance mumbai rally

ఈ దేశ రాజు(ప్రధాని మోడీ) ఆత్మ ఈవీఎంలో ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరోసారు ఈవీఎం​లను ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని వారు అనుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈవీఎం​కు ఉండే వీవీప్యాట్ రశీదు చాలా ముఖ్యమని అన్నారు. వీవీప్యాట్‌ని కూడా లెక్కించమని తాము భారత ఎన్నికల సంఘాన్ని కోరామని, కానీ తమ డిమాండ్ అంగీకరించలేదని తెలిపారు.

దేశం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిందన్న రాహుల్ గాంధీ.. దేశం కేవలం 23 మంది పారిశ్రామికవేత్తలు, 90 మంది అధికారుల చేతుల్లో నడుస్తోందని విమర్శించారు. ఇందులో పేద దళితులు, గిరిజనులు ఎవరూ కనిపించరని, దేశంలో నియంతృత్వం మాత్రమే కొనసాగుతోందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో మోడీ ప్రసిద్ధి రాహుల్​ గాంధీ విమర్శించారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. చైనాతో సహా దేశంలోని పారిశ్రామికవేత్తలకు దేశ సొమ్ము చేరుతోంది. ధారావి అభివృద్ధికి మోడీ అనుమతి ఇవ్వడం లేదు. నేను మోడీ, ఈడీకి భయపడను. వారు నన్ను 50 గంటల పాటు ప్రశ్నించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారని రాహుల్​ గాంధీ చెప్పారు. కొన్ని కంపెనీల కోసం చిరు వ్యాపారులను ప్రభుత్వం చంపేస్తోందని ఆరోపించారు. ఇది ప్రేమకు నిలయం అని, అందరూ విద్వేష మార్కెట్​లో ప్రేమ దుకాణం తెరవాలని రాహుల్ పిలుపునిచ్చారు. కాగా, ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఇండియా కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+