రాహుల్ గాంధీ భారత్ లో బ్యాచిలర్, సార్ కు విదేశాల్లో భార్య, పిల్లలు, గాలి రెడ్డి బ్రదర్ !

బెంగళూరు/బళ్లారి: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసింది. కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీ ఎందుకు ఓడిపోయింది అంటూ బీజేపీ నాయకులు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి చర్చిస్తున్నారు. ఇంతకాలం బీజేపీకి కంచుకోటగా ఉన్న బళ్లారి జిల్లాలో బీజేపీ వాషౌట్ అయ్యింది.

బళ్లారిలో బీజేపీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం బళ్లారిలో బీజేపీ కార్యకర్తల సమవేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువరాజు రాహుల్ గాంధీ మీద సంచలన వ్యఖ్యలు చేశారు.

somshekarreddy
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, మేము ఓడిపోలేదని, కాంగ్రెస్ ఉచిత హామీలు గెలిచాయని, నేడు ఫ్రీగా బస్సుల్లో మహిళలు తిరుగుతున్నారని, భవిష్యత్తులో ఇదే కర్ణాటక ప్రజలు ఆర్ టీసీకి నాలుగింతలు ఎక్కువగా టిక్కెట్ల ధర చెల్లించాల్సి వస్తుందని కాంగ్రెస్ హామీలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు.

బళ్లారిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన గాలి సోమశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇప్పుడు జరిగిన పొరపాటు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోవాల్సి వస్తుందని, మనకు ప్రధాని నరేంద్ర మోదీ దూరం కాకుండా ఉండాలంటే బీజేపీని భలోపేతం చెయ్యాలని గాలి సోమశేఖర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

somshekarreddy

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని, ఆయన ఓడిపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని, కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఎలా ఉన్నారు? ఎలా పని చేశారు ?, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ఎలా ఉన్నారు, ఎలా పని చేస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి వ్యంగ్యంగా నటించి చూపించడంతో బీజేపీ కార్యకర్తలు ఈలలు, కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం వెనిజులా దేశం పరిస్థితి దయనీయంగా ఉందని, ఆ పరిస్థితి భారత్‌కు రాకూడదని, మనం అందరూ కలిసికట్టుగా బీజేపీని రక్షించుకుందామని గాలి సోమశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. డీకే శివకుమార్ ఇప్పుడు మహిళలకు బస్సుల్లో ఫ్రీ ఫ్రీఫ్రీ అంటూ ఆర్ టీసీ బస్సుల సంఖ్యను తగ్గించారని గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే భారతదేశ పరిస్థితి అధోగతి పాలవుతుందని, కాంగ్రెస్ ఇచ్చే హామీల కారణంగా భారత్ కు వెనిజులా దేశానికి వచ్చిన పరిస్థితి వస్తోందని గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు.

 rahulgandhi-

శుక్రవారం పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పెళ్లి చేసుకోవాలని చెప్పారని, అయితే రాహుల్ గాంధీకి అప్పటికే పెళ్లయిందని, రాహుల్ గాంధీకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని బళ్లారి సిటీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మన దేశంలో సన్యాసిగా, బ్యాచిలర్ గా తిరుగుతున్నారని, విదేశాల్లో మాత్రం సంచారిగా, సొగ్గాడిగా తిరుగుతున్నారని గాలి సోమశేఖర్ రెడ్డి వ్యంగంగా అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్‌ జోడో యాత్ర అంటూ తిరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం సాధించారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జూడో యాత్ర వలన, రాహుల్ గాంధీ వలన కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి ఎలాంటి లాభం లేదని గాలి సోమశేఖర్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+