భద్రతకు నో! రాహుల్‌గాంధీ ఇన్నాళ్లు ఎక్కడున్నారు, ఏం చేశారు?
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 57 రోజుల అజ్ఞాతం తర్వాత న్యూఢిల్లీకి చేరుకున్న తర్వాత.. ఇన్నాళ్లు ఆయన ఎక్కడున్నారు? ఏం చేశారు? అనే దాని పైన విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆగ్నేయాసియాలోని వియాత్నం నుంచి భారత్ చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఆయన కొన్నాళ్లు బ్యాంకాక్ నుండి వచ్చారని అంటున్నారు. ఆయన థాయ్ ఎయిర్ వేస్‌లో భారత్‌కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 22వ తేదీ నుండి రాహుల్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
ఈ రెండు నెలల కాలంలో ఆయన యాగ్నోన్, మయన్మార్‌లలో మెడిటేషన్‌కు ఫేమస్ అయిన సెంటర్‌లలో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉరుగ్వేలో కొంతకాలం ఉన్నట్లుగా సమాచారం. ఆయన బ్యాంకాక్ నుండి బుధవారం రాత్రి తిరిగి వచ్చేందుకు సిద్ధం కాగా, విమానం ఆలస్యం కారణంగా ఆయన గురువారం ఉదయానికి ఢిల్లీకి చేరుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎస్పీజీని వద్దన్నారు?
తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన వెంట ప్రత్యేక సాయుధ బృందం (ఎస్పీజీ) రావాల్సిన అవసరం లేదని రాహుల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆయన దేశాల్లో ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీని తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు, తన పర్యటన వివరాలు వెల్లడించవద్దని రాహుల్ గాంధీ భద్రత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
రాహుల్ ఇంటికి సోనియా, ప్రియాంక
రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో ఆయన ఇంటికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ గురువారం ఉదయం వచ్చారు. ఫిబ్రవరి 20 నుంచి రాహుల్ గాంధీ అజ్ఞాతంలో ఉన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సైతం రాహుల్ సెలవు పెట్టారు. పార్టీ ప్రక్షాళన గురించి, పార్టీలో తాను నిర్వహించవలసిన పాత్ర గురించి అంతర్మథనం చేసుకునేందుకే రాహుల్ సెలవు తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వచ్చాయి.












Click it and Unblock the Notifications